బాలీవుడ్ లో బయోపిక్‌ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా.. బాగ్ మిల్కాబాగ్ - ప్రముఖ బాక్సర్.. మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా మేరీకోమ్ - మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ జీవిత కథ ఆధారంగా సచిన్ - డాషింగ్ వికెట్ కీపర్ - గొప్ప మ్యాచ్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ధోని - ప్రముఖ రెజ్లింగ్ కోచ్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ సినిమాలు తెరకెక్కి అద్భుత విజయాలు సాధించాయి. త్వరలో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత పి.వి.సింధు - మరో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితకథలు - అదేవిధంగా టెన్నిస్ డబుల్స్ లో అనేక గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్నసానియా మీర్జా - ప్రముఖ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి - టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథలు తెరకెక్కునున్నాయి.
ఈ క్రమంలో ప్రపంచంలోనే గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడైన కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రణ్ వీర్ సింగ్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ లెజెండరీ ప్లేయర్ - వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ను కలిశాడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్. 1983 వరల్డ్ కప్ పై తెరకెక్కుతున్న మూవీలో కపిల్ పాత్రను రణ్ వీరే పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్పుడు వరల్డ్ కప్ గెలిచిన టీమంతా ఓ ఈవెంట్ కు హాజరైంది. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న కబీర్ ఖాన్ కూడా ఈ ఈవెంట్ కు వచ్చాడు. ఈ సందర్భంగా రీల్ కపిల్ తో ఫొటోలకు ఫోజులిచ్చాడు.. రియల్ కపిల్ దేవ్.
1983 వరల్డ్ కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నది. ఈ స్పెషల్ ఈవెంట్ కు కెప్టెన్ కపిల్ తోపాటు నాటి వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులు వెంగ్ సర్కార్ - మదన్ లాల్ - సందీప్ పాటిల్ - మొహిందర్ అమర్ నాథ్ - రోజర్ బిన్నీ కూడా హాజరవడం విశేషం.