టాలీవుడ్ జనాలు కానీ.. ఎన్టీఆర్ అభిమానులు కానీ టెంపర్ మూవీని మర్చిపోవడం చాలా కష్టం. ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్ కథను పూరీ తెరకెక్కించిన వైనం.. యంగ్ టైగర్ అద్వితీయ నటన అంతగా జనాలను మెప్పించేశాయి. ఈ చిత్రంతోనే జూనియర్ మళ్లీ తన విన్నింగ్ స్ట్రీక్ స్టార్ట్ చేశాడు. అందుకే టెంపర్ అంటే నందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ లైకింగ్.
టాలీవుడ్ హిట్ సినిమాలను బాలీవుడ్ జనాలు తెగ రీమేక్ చేసేస్తున్నారు. వీటిలో టెంపర్ కూడా ఉంది. కరణ్ జోహార్ లాంటి ఫిలిం మేకర్ ఈ మూవీ రైట్స్ ను తీసుకుని.. రణవీర్ సింగ్ హీరోగా టెంపర్ రీమేక్ చేస్తున్నాడు. కమర్షియల్ మూవీ మేకర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పుడీ మూవీ ఫస్ట్ లుక్ ని హీరో రణవీర్ సింగ్ రిలీజ్ చేశాడు. శింబా అనే టైటిల్ ను నిర్ణయించగా.. సంగ్రామ్ భలేరావ్ అన్నది హీరో క్యారెక్టర్ పేరు. పోలీస్ గెటప్ లో మెడలో ఐరన్ చైన్ వేసుకుని.. రణవీర్ అరుస్తున్న లుక్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ లుక్ తో పాటే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇచ్చేయడం విశేషం. 2018 డిసెంబర్ 28 శింబా మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉంటాయని.. రణవీర్ సింగ్ కెరీర్ లో అత్యధికంగా యాక్షన్ సీక్వెన్స్ లు మూవీ ఇదేనని దర్శకుడు రోహిత్ శెట్టి చెబుతున్నాడు.