వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది పద్మావతి చిత్రం. క్లాప్ కొట్టిన నాటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయం సినిమాకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తే. థియేటర్లు కాల్చేస్తామంటూ కొందరు నేతలు వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మీద ఇప్పటికి ఉన్న వివాదాలు చాలనట్లు ఈ చిత్ర హీరోగా నటించిన రణ్ వీర్ సింగ్ మరో వివాదానికి తెర తీశారు.
పలువురు ప్రముఖులు ఇప్పటికే పద్మావతి చిత్రంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వాతావరణం వేడెక్కిపోతే.. తాజాగా ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జి పాత్రను పోషించిన రణ్ వీర్ సింగ్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ పెను దుమారాన్ని రేపుతోంది.
ఖిల్జీ హెయిర్ స్టల్ తో ఉన్న ఫోటోను పెట్టిన రణ్ వీర్.. నేను నా మతాన్ని కోల్పోతున్నాను అంటూ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రణ్ వీర్ ట్వీట్ కు కొందరు మంచిదేలే అంటూ రియాక్ట్ కాగా.. మరికొందరు మాత్రం కళాకారులకు మతం అంటూ ఏమీ ఉండదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చూస్తుంటే.. తానీ పాత్రలో జీవించినట్లుగా చెప్పటానికి వీలుగా తాజా వ్యాఖ్య చేశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దుమారంగా మారిన తన ట్వీట్ పై రణ్ వీర్ వివరణ ఏమీ ఇవ్వలేదు.