ఆద‌ర్శ జంట స్టన్నింగ్ లుక్ చూశారా!

Update: 2019-12-17 01:30 GMT
బాలీవుడ్ లో ర‌ణ‌వీర్- దీపిక జోడీ ఆద‌ర్శ జంట‌గా పాపుల‌రైంది. గ‌త కొంత‌కాలంగా ఈ జంట ఏ వేడుక‌కు వెళ్లినా కామ‌న్ గా ఓ ప్ర‌శ్న‌ను ఎదుర్కొంటోంది. దానికి సూటిగా స‌మాధానం ఇవ్వ‌కుండా దాటవేస్తూ త‌ప్పించుకుని తిరుగుతున్నార‌నే చెప్పాలి. అయితే ఇటీవ‌ల దీపిక.. ర‌ణ‌వీర్ ఇద్ద‌రూ సినిమాల‌తో బిజీబిజీగా ఉండ‌డంతో ఈ ఒత్తిడిని ప‌దే ప‌దే ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

తాజాగా ముంబైలో ఓ సంగీత క‌చేరీ ఈవెంట్లో ర‌ణ‌వీర్ - దీపిక జోడీ షో స్టాప‌ర్స్ గా నిలిచారు. ఆ ఇద్ద‌రి లుక్ ఈ వేదిక వ‌ద్ద హాట్ టాపిక్ అయ్యింది. ర‌ణవీర్ ఎప్ప‌టిలానే త‌న‌దైన ఎన‌ర్జీతో క‌నిపించాడు. కాజువ‌ల్ బ్లాక్ టీష‌ర్ట్- రెడ్ ఫ్యాంట్ కాంబినేష‌న్ గా వేసుకున్నాడు. మ్యాచింగ్ బ్లాక్ షూస్.. బ్లాక్ హ్యాట్ .. కూల్ గ్లాసెస్ ధ‌రించాడు. ఇక దీపిక వైట్ ష‌ర్ట్ బ్లాక్ షార్ట్స్ కి మ్యాచింగ్ షూస్ ధ‌రించింది. అలాగే కూల్ గ్లాసెస్ తో క‌నిపించి మురిపించింది.

ర‌ణ‌వీర్- దీపిక జంట 83 అనే చిత్రంలో న‌టిస్తున్నారు. 1983లో టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రమిది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే దీపిక న‌టిస్తున్న క్రేజీ చిత్రం చ‌పాక్ ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజైంది. యాసిడ్ ఎటాక్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక ర‌ణ‌వీర్ న‌టించిన సింబా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. అత‌డు వ‌రుస‌గా ప‌లు భారీ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News