బ్లాక్ బస్టర్ హిట్లు ఉంటాయి.. ఈ బ్లాక్ బస్టర్ లవ్వులు.. బ్లాక్ బస్టర్ బ్రేకప్పులు ఏంటి అంటారా? బాలీవుడ్లో సినిమాల కంటే కూడా లవ్ స్టోరీలు.. బ్రేకప్ స్టోరీలకే మీడియాలో ప్రాధాన్యం ఎక్కువ. సగం వార్తలు వాటి గురించే ఉంటాయి. ఒక హీరో హీరోయిన్ ప్రేమలో పడిన మొదట్లో వాళ్ల లవ్ స్టోరీ హైలైట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎప్పుడు విడిపోతారా అని చూస్తుంటాడు బాలీవుడ్ జనాలు. ఇక వాళ్ల మధ్య దూరం పెరగడం ఆలస్యం.. బ్రేకప్ స్టోరీస్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. ఆ ఇద్దరూ విడిపోయాక కూడా స్టోరీస్ కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ ల బ్లాక్ బస్టర్ ప్రేమ కథ.. బ్రేకప్ స్టోరీగా మారుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి.
గత కొన్నేళ్లలో ఇటు దీపికా పదుకొనే.. అటు రణ్వీర్ సింగ్ ఇద్దరూ కూడా కెరీర్లో భలేగా ఎదిగారు. స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపిక హాలీవుడ్ రేంజికి ఎదిగితే.. మామూలు హీరోగా ఉన్న రణ్వీర్ స్టార్ అయ్యాడు. ఐతే రణ్వీర్ ఎంత ఎదిగినా.. దీపికను అందుకునే స్థాయికి ఇంకా చేరలేదు. దీపిక ఇండియన్ సినిమాలు బాగా తగ్గించేసి హాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో రణ్వీర్ కే కాదు తన కుటుంబ సభ్యులకు కూడా సమయం కేటాయించే పరిస్థితి లేదు. హాలీవుడ్లో బిజీ అయితే తన రేంజే మారిపోతుంది కాబట్టి ఈ దశలో ప్రేమ.. పెళ్లి లాంటి వ్యవహారాలపై దృష్టిపెట్టే అవకాశం లేదు. ప్రియుడి కోసం సమయం కేటాయించకుండా ప్రేమికురాలిగా కొనసాగడం అంటే కష్టం. అందుకే దీపిక.. రణ్వీర్ నుంచి విడిపోతున్నట్లు సమాచారం. ఐతే బాలీవుడ్లో ప్రేమాయణాలు పెళ్లి వరకు కొనసాగడం అరుదు. ఇక పెళ్లే తరువాయి అనుకున్న కత్రినా-రణబీర్ కథ ఏమైందో తెలిసిందే. కాబట్టి దీపిక-రణ్వీర్ బ్రేకప్ అన్నది జనాలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించట్లేదు. ఐతే బహిరంగంగా ముద్దులాడేసి తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పిన దీపిక-రణ్వీర్.. తమ బ్రేకప్ గురించి ఎలా కన్వే చేస్తారో చూడాలి. ‘పద్మావతి’ సినిమా ప్రమోషన్ల టైంలో వీళ్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి బ్రేకప్ కన్ఫమ్ చేసుకోవచ్చేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/