కాటమరాయుడు నాకు మైల్ స్టోన్ మూవీ

Update: 2016-12-18 04:44 GMT
కేరక్టర్ ఆర్టిస్ట్ గా రావు రమేష్ పేరు మార్మోగిపోతోంది. ఎలాంటి కేరక్టర్ అయిన తనదైన శైలితో మెప్పించేస్తున్నాడు. కేరక్టర్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా.. తన నటనతో ఆ పాత్రకు వన్నె చేకూరుస్తున్నాడు. రీసెంట్ రిలీజ్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ లో రావు రమేష్ పోషించిన రోల్ గురించి.. థియేటర్ బైటకు వచ్చాక కూడా ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారంటే.. ఎంత అద్భుతంగా నటించాడో అర్ధమవుతుంది.

'ఈ సినిమా చేశాక నాకు అందరూ చూపించే గౌరవం ఇంకా పెరిగింది. మరో ఐదేళ్ల వరకూ ఇలాంటి తండ్రి కేరక్టర్ రాదని అందరూ అంటున్నారు. తండ్రిగా నా కెరీర్ లో ది బెస్ట్ కేరక్టర్ చేశానని అంటున్నారు. నా కెరీర్ లో ఇది చాలా కీలకమైన చిత్రం. సాయికృష్ణ కధ.. ప్రసన్నకుమార్ డైలాగ్స్.. భాస్కర్ దర్శకత్వం.. అన్నిటికీ మించి దిల్ రాజు ఇచ్చిన సలహాలు.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీ అద్భుతంగా రావడానికి కారణమయ్యాయి' అంటున్న రావు రమేష్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి కాటమరాయుడులో కీలకపాత్ర చేస్తున్నానని.. తన కెరీర్ లో అది మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నాడు.

అసలు ఏ సినిమా కోసం అయినా ఏ పాత్ర కోసమయినా తాను ఏ మాత్రం ప్రిపేర్ కానని.. దర్శకులకు ఓ ఆలోచన ఉంటుంది కాబట్టి.. దాన్ని బట్టి నడుచుకునేందుకు ఇంపార్టెన్స్ ఇస్తానంటున్నాడు. దర్శకుడు రచయిత పడ్డ శ్రమని తెరపై పలికించాలంటే.. అసలు ప్రిపరేషన్ లేకుండా జీరో మైండ్ తో సెట్స్ కు వెళ్లాలన్నది రావు రమేష్ సలహా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News