'ది యూస్ వల్ సస్పెక్స్ట్ '.. 'అమెరికన్ బ్యూటీ' వంటి చిత్రాల్లో నటించిన హాలీవుడ్ నటుడు..ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై అత్యాచారం కేసు నమోదైంది. కెవిన్ కి వ్యతిరేకంగా అభియోగాలు నమోదవ్వడంతో బ్రిటన్ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేసారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. అప్పట్లో తెరపైకి వచ్చిన 'మీటూ ఉద్యమం'లో భాగంగా తొలిసారి కెవిన్ పై లైంగిక ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
దీంతో అప్పట్లోనే మొదటిసారి కేసు నమోదైంది. తాజాగా బ్రిటన్ కి చెందిన ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ కేసును దర్యాప్తు చేసి ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో ఏముందంటే?.. ''కెవిన్ ముగ్గురు వ్యక్తులపై నాలుగు సార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. వారి అనుమతి లేకుండా పాశవికంగా ప్రవర్తించాడు. లండన్ లో తొలిసారి 2005 మార్చిలో ఓ మహిళపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2008 లో అదే సిటీలో మళ్లీ రెండవ వ్యక్తితో మూడోసారి లైంగిక చర్యకి దిగాడు.
మరోసారి 2013లో నాలుగోసారి అలాంటి దాడికి యత్నించాడు. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం బాధితుల్ని ఇప్పటివవరకూ గుర్తించలేదని ప్రకటనలో ఉంది. కెవిన్ పై లైంగిక ఆరోపణలు రావడంతో హౌస్ ఆఫ్ కార్స్డ్ చివరి సీజన్ నుంచి నెట్ ప్లిక్స్ తొలగించింది. మరోబయోపిక్ నుంచి అతన్ని రీప్లేస్ చేసింది. గతంలోనూ కెవిన్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని తోసిపుచ్చారు.
దీంతో కెవిన్ సినిమా భవితవ్యం ప్రశ్నార్ధకరంగా మారింది. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ లు చేజారిపోయాయి. బాధిత మహిళలు మీడియా ముందుకొస్తే కేసు మరింత స్ర్టాంగ్ అవుతుంది. దీంతో కెవిన్ కి తిప్పలు తప్పవని తెలుస్తోంది. ఇప్పటికే పలవురు హాలీవుడ్ నటులు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
హాలీవుడ్ హాస్యనటుడు క్రిస్ డెలియా పై బాధిత మహిళలు లైంగిక ఆరోపణలు చేసారు. వీటిపై క్రిస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. అలాగే మరో హాలీవుడ్ నటుడు క్రిస్ నాత్ పై గాయని లీసా జెంటిల్ తీవ్ర లైంగిక ఆరోపణలు చేసింది. తాజాగా ఈ వరుసలో కెవిన్ కూడా చేరడంతో హలీవుడ్ పరిశ్రమ ప్రతిష్ట దిగజారుతుంది.
తెర ముందు..తెర వెనుక తారలు ఇలా ఉంటారా? అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మధ్య దేశ వ్యాప్తంగా 'మీటూ ఉద్యమం' పతాక స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తెరపైకి వచ్చి తమకి జరిగిన అన్యాయంపై గళం విప్పే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత పలువురు నటీమణులు లైంగిక దాడులపై పలు ఇంటర్వ్యూల్లో పబ్లిక్ గానే మాట్లాడారు.