#రాపో.. పాన్ ఇండియా కోస‌మేనా ఈ పాకులాట‌?

Update: 2021-06-06 08:30 GMT
లేటుగా మొద‌లెట్టినా లేటెస్టుగా ఆలోచిస్తున్నాడు రాపో. కేవ‌లం ప్రాంతీయ కంటెంట్ ని న‌మ్ముకుంటే లాభం లేద‌ని గ్ర‌హించి ప్ర‌స్తుతం అత‌డు యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టుల్ని ఎంచుకునే ప‌నిలో ఉన్నాడు. కేవ‌లం ఒక భాష‌కే ప‌రిమితం అయితే అది ఇప్పుడున్న స‌న్నివేశంలో స‌రికాద‌ని భావిస్తున్నాడ‌ట రామ్ పోతినేని.

ఆ క్ర‌మంలోనే స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామి చిత్రంతో తమిళంలోకి అడుగుపెడుతున్నాడు. తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రంతో త‌న రేంజును విస్త‌రించే ప‌నిలో ఉన్నాడు. అతను మొదట తమిళ మార్కెట్ పై ప‌ట్టు సాధిస్తే త‌ర్వాత ఇత‌ర మార్కెట్ల‌పైనా దృష్టి సారిస్తాడ‌ట‌. త్వ‌ర‌లోనే హిందీ చిత్రంలో న‌టించే ఆలోచ‌న కూడా ఉందిట‌. ఇప్ప‌టికే హిందీ బెల్ట్ లో తన పరిచయాలను ఉపయోగించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ని తెలిసింది.

ఇటీవ‌ల రామ్ న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ హిందీ ఆడియెన్ కి క‌నెక్ట‌య్యింది. అత‌డి గ‌త చిత్రాలు ఓటీటీల్లో టీవీల్లో హిందీ వెర్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. తాను న‌టించే అనువాదాల‌కు హిందీలో మంచి ఆఫర్లు వచ్చేలా చూసుకుంటున్నాడు. ఇక‌పై ఓటీటీ దారిలో వెళ్లి హిందీ ఆడియెన్ తో పాటు గ్లోబ‌ల్ ఆడియెన్ కి రీచ్ అవ్వాల‌ని గ‌ట్టి పంతంతో ఉన్నాడ‌ట‌. అయితే మారిన అత‌డి ఆలోచ‌న‌ల్ని క్యాష్ చేసుకుంటూ ఎవ‌రైనా వెబ్ సిరీస్ ద‌ర్శ‌కులు త‌న‌ని క‌లుస్తారా?  లేక బాలీవుడ్ నుంచి కూడా ఎవ‌రైనా క‌థ‌లు వినిపిస్తారా? అన్న‌ది చూడాలి.  తెలుగు -త‌మిళం- హిందీ మార్కెట్ల‌ను కొల్ల‌గొట్టే కంటెంట్ తో ఎవ‌రు వ‌చ్చినా అవ‌కాశం ఇచ్చేందుకు రామ్ సిద్ధంగానే ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియ‌న్ స్టార్ గా ఒక‌సారి స‌త్తా చాటితే అది అన్నిర‌కాలా త‌న మార్కెట్ కి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News