ఉంటానో, వెళతానో అని భయపడేదాన్ని

Update: 2015-08-25 10:04 GMT
టాలీవుడ్‌ లో నవతరం నాయికల హవా మొదలైంది. మునుపటితో పోలిస్తే ఈ హవా పెద్ద రేంజు లోనే ఉంది. సౌందర్య, విజయశాంతిలా దశాబ్ధాల పాటు నిలదొక్కుకున్న నాయికలు ఇటీవలి కాలంలో కనిపించడం లేదు. త్రిష, ఇలియానా, నయనతార, కాజల్‌ చూపించిన హవా ఆ తర్వాత ఇంకెవరూ చూపించలేకపోయారు. అయితే ఆ గ్యాప్‌ ని ఫిల్‌ చేస్తూ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశీఖన్నా వంటి నాయికలు కెరీర్‌ లో దూసుకుపోతున్నారు.

రకూల్‌ స్టార్‌ హీరోల సరసన కమిటై స్టార్‌ హీరోయిన్‌ లీగ్‌ లోకి వెళ్లిపోయింది. ఆ వెంటే రాశిఖన్నా కూడా ఫాలో అయిపోతోంది. రాశీ కెరీర్‌ ఆరంభం ఛోటా హీరోలతో నటించింది. ఇప్పుడు మాస్‌రాజా రవితేజ లాంటి బడా హీరోతో నటించేసింది. మెగా క్యాంప్‌ కళ్లు కూడా ఈ అమ్మడిపై ఉన్నాయి. కాబట్టి మునుముందు రాశీ పెద్ద హీరోయిన్‌ అయిపోవడం ఖాయం.

మారుతున్న ట్రెండ్‌ గురించి రాశీ మాట్లాడుతూ.. కొత్త గాలి వీస్తున్న టైమ్‌ లోనే టాలీవుడ్‌ లో అడుగుపెట్టా. ఫ్లోలో వెళ్లిపోతున్నా. ఇప్పుడొస్తున్న తారల్లో ప్రతి ఒక్కరూ అంతో ఇంతో ప్రభావం చూపిస్తున్నారు. స్థిరంగానే కెరీర్‌ ని సాగించగలుగుతున్నారు. కెరీర్‌ ఆరంభం నిలదొక్కుకోగలనా? లేదా? అని భయపడేదానిని.. అని మనసులో మాట చెప్పింది. ప్రస్తుతం రవితేజ బెంగాళ్‌ టైగర్‌, రామ్‌ శివం సినిమాల్లో నటిస్తోంది రాశీ.
Tags:    

Similar News