ఆడ పులులు పిచ్చెత్తిస్తున్నాయ్‌!!!

Update: 2015-12-09 13:30 GMT
మాస్ మహరాజా బెంగాల్ టైగర్.. మరి కొన్ని గంటల్లో సందడి స్టార్ట్ చేసేయనుంది. దీంతో ఇప్పటివరకు ఓ లెక్క.. ఇక్కడి నుంచి ఓ లెక్క అన్నట్లుగా ప్రచారం వేడెక్కిపోయింది. పబ్లిసిటీలా బాగా స్లోగా ఉన్నారనే మాట కొన్ని రోజుల క్రితం వరకూ వినిపించినా ఇప్పుడు.. టైగర్ స్పీడ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

కిక్2 లాంటి ఫ్లాప్ తర్వాత వస్తుండడంతో.. బెంగాల్ టైగర్ ని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు రవితేజ బాగా కష్టపడుతున్నాడు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా - రాశి ఖన్నాల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ పై తమ్మూ కన్నేస్తే.. ఫస్ట్ బ్లాక్ బస్టర్ కోసం రాశి ఎదురుచూస్తోంది. అందుకే తమ పెర్ఫామెన్స్ తో పాటు.. గ్లామర్ ని కూడా బాగానే ఒలకబోశారు. డైరెక్టర్ సంపత్ నంది కూడా.. హీరోయిన్లపై గట్టిగానే ఫోకస్ చేశాడు. ఈ మద్య కాలంలో ఎప్పుడూ లేనంత హాట్ గా భామల వయ్యారాలు, ఒంపుసొంపలు ప్రదర్శించే ఫోటోలతో ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికే నాన్ వెజ్ మూవీ అని రవితేజ హింట్ ఇచ్చాడు. దీన్ని ప్రూవ్ చేయడానికా అన్నట్లుగా.. అందాల భామలు రెచ్చిపోయి పోటీపడి మరీ చిందేసిన పిక్స్ ను రిలీజ్ చేస్తూ ఆడియన్స్ కు పిచ్చెత్తిస్తున్నారు.

ఇంతగా హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ ఫోటోలను రిలీజ్ చేసిన మూవీ.. రీసెంట్ టైంలో ఇదే అని చెప్పుకోవాలి. అన్నింటిలోనూ తమన్నా - రాశిఖన్నాలు ఆడపులుల్లా రెచ్చిపోతూనే ఉన్నారు. ఒకటి రెండింటిలో మాస్ మహరాజాపై పడిపోతున్నారు కూడా. బెంగాల్ టైగర్ వాలకం చూస్తుంటే.. ఈ ఫోటోలు చూశాకైనా.. జనాలు థియేటర్లకు ఖచ్చితంగా వస్తారన్నట్లుగా ఉంది.
Tags:    

Similar News