మూడు పరిశ్రమల్లో మూడు పడవల ప్రయాణం సరైనదేనా? దానివల్ల వందల కిలోమీటర్లు విపరీతమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కదా? అది తీవ్ర ఒత్తిడికి దారి తీయదా? అంటూ ప్రశ్నిస్తే.. అందాల రాశీ ఖన్నా ఏం చెప్పిందో తెలుసా? అసలు దీనిని కష్టం అని అనుకోను. ఆస్వాధిస్తూ పని చేయడం నా పద్ధతి అంటూ తెలివైన సూటియైన సమాధానం ఇచ్చింది. కాలి బొటనవేలి అంచుపై నిలిచి పని చేయగలిగేంత అవకాశం అదృష్టం శక్తి తనకు ఉన్నాయని అంది. మూడు విభిన్న భాషల్లో తన ప్రాజెక్ట్ ల కోసం చెన్నై- హైదరాబాద్- ముంబై నగరాల మధ్య అటూ ఇటూ ప్రయాణించడంతోనే సమయం అంతా సరిపోతుంది. కానీ దీనిపై ఫిర్యాదు చేయను అని రాశీ అంది.
రాశీ ఖన్నా ఓ వైపు నాగచైతన్య థాంక్యూలో నటిస్తోంది. దీనికోసం హైదరాబాద్ సహా పలు నగరాలకు వెళ్లాల్సి ఉంది. మరోవైపు షాహిద్ కపూర్ తో కలిసి ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకె సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్న రాశి ఖన్నా.. ఇప్పుడు అజయ్ దేవగన్ తో కలిసి `రుద్ర` సిరీస్ షూటింగ్ ని ప్రారంభించింది. అందుకోసం ముంబైకి వెళ్లింది. అటుపై చెన్నైకి వచ్చి ధనుష్ తో సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవేగాక..తుగ్లక్ దర్బార్ -అరణ్మనై 3 -భ్రమమ్ వంటి చిత్రాల షెడ్యూల్స్ ని ఫినిష్ చేయాలంటే ప్రయాణాలు తప్పదు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని ప్రతిదీ పూర్తి చేస్తున్నాని రాశీ వెల్లడించారు.
నా జర్నీలో నేను ఎక్కడికి చేరుకోవాలో దానికోసం నేను చాలా కష్టపడ్డాను. దాని ఫలితంగా ఉత్తరాది దక్షిణాదిలోని వినోద పరిశ్రమలలో ఆసక్తికరమైన అవకాశాలు వచ్చాయి. మూడు నాలుగు నగరాలను చుట్టేసి రావడం అంత సులభం కాదు. కానీ నేను ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ తెలివైన నిర్ణయాలతో మంచి మనసుతో పని చేయాలనుకుంటున్నాను.. అని తెలిపింది.