మక్కల్ సెల్వన్ తో రాశీఖన్నా - సందీప్ కిషన్..!

Update: 2021-08-02 07:53 GMT
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగు పెట్టాడు సేతుపతి.. ఇప్పటికే తమిళ్ లో రెండు ఆంథాలజీ సిరీస్ లలో నటించాడు. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్' సృష్టికర్తలు రాజ్ & డీకే రూపొందించే ఓ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో దర్శకద్వయం రాజ్ - డీకే ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బబ్లీ బ్యూటీ రాశీఖన్నా కూడా నటిస్తోంది. ఈ సిరీస్‌ సెట్ లో విజయ్ సేతుపతి కూడా అడుగుపెట్టినట్లు రాశీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''నాకు ఇష్టమైన హ్యూమన్/యాక్టర్‌ తో మూడోసారి కలసి నటిస్తున్నాను. ఈసారి హిందీలో. సెట్‌ లోకి విజయ్ సేతుపతి సర్ కి స్వాగతం'' అని రాశి ట్వీట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా సేతుపతి తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని కూడా షేర్ చేసింది రాశీ.

ఇంతకముందు 'సంఘ తమిజాన్' మరియు 'తుగ్లక్ దర్బార్' వంటి చిత్రాల్లో విజయ్ సేతుపతి సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ లో మూడోసారి టాలెంటెడ్ యాక్టర్ తో కలిసి నటిస్తున్నందుకు రాశీ ఎగ్జైట్ అవుతోంది. మరోవైపు షాహిద్ కపూర్ కూడా విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "సెట్‌ లో వెయిట్ చేస్తుంటాను. రాజ్ డీకే త్వరలో నన్ను పిలవండి. విజయ్ సేతుపతి తో ఫ్రేమ్‌ ని షేర్ చేసుకోడానికి వేచి ఉండలేను. సారీ రాశీఖన్నా.. నేను మీతో కలిసి సెట్‌ లో ఉండటం చాలా అలవాటు చేసుకున్నాను" అని షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశాడు.

రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు ''సన్నీ'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ కూడా విజయ్ సేతుపతి తో కలసి నటిస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ''ది బిగ్ బ్రదర్ లవ్. వన్ అండ్ వన్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. లోడింగ్ సూన్'' అంటూ సందీప్ కిషన్ ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సందీప్ - విజయ్ ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను షేర్ చేసాడు. దీంతో రాజ్ అండ్ డీకే తీస్తున్న వెబ్ సిరీస్ లోనే విజయ్ - సందీప్ కలిసి నటిస్తున్నారేమో అని నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సందీప్ కిషన్ గతంలో రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే నిర్మించిన 'డీ ఫర్ దోపిడీ' చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అలానే 'షోర్ ఇన్ ది సిటీ' అనే హిందీ సినిమాతో డెబ్యూ ఇచ్చిన సందీప్.. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ సీజన్-1 లో కూడా కీ రోల్ ప్లే చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు దర్శకద్వయం రూపొందించే మరో వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి - సందీప్ కిషన్ కలిసి నటించబోయేది షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ లోనా? లేదా మరేదైనా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News