రాశీ Vs ర‌ష్మిక‌: ఒలింపిక్ కి వెళితే క‌ప్ గ్యారెంటీ

Update: 2021-08-07 14:30 GMT
టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు రాశీఖ‌న్నా.. ర‌ష్మిక మంద‌న‌ల సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌ష్మిక కంటే రాశీ సీనియ‌ర్.. అయినా కెరీర్ ప‌రంగా సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ లో చాలా స్పీడ్ మీద ఉంది. నెట్టింట రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది. ఇన్ స్టా..ట్విట‌ర్..ఎఫ్.బి మాధ్య‌మాల్లో ఈ భామ‌ల పాపులారిటీ అసాధార‌ణం. ఎప్ప‌టిక‌ప్పుడు  హాట్ ఫోటోల‌తో హీటెక్కించ‌డం రాశీ-ర‌ష్మిక‌ల ప్ర‌త్యేత‌. యోగా.. జిమ్ వీడియోలు సైతం పోస్ట్ చేసి కుర్రాళ్ల‌లో జోష్ ని  నింపుతుంటారు. తాజాగా ఈ భామ‌లిద్ద‌రు అక్కా చెల్లెళ్ల‌లా  ఒలింపిక్ అథ్లెట్ లా ఫోజులిస్తున్నారు. ఇద్ద‌రు జిమ్ వ‌ద్ద క‌లిసి దిగిన ఓ ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా పంచుకున్నారు. జిమ్ములో వ‌ర్కౌట్ల అనంత‌రం  ఇలా ఇద్ద‌రు క‌లిసి చిల్ అవుతున్న ఫోటోని సోష‌ల్ మీడియాలోకి వ‌దిలారు.

ఓ వైపు టోక్యో ఒలింపిక్ హీట్ పెంచుతున్న ఇలాంటి టైమ్ లో ఇలా ఆ ఇద్ద‌రు ఫ్రెండ్స్ ఒలింపిక్  అథ్లెట్లలా ఫోజులిచ్చారు. బిగువైన స్కిన్ టైట్ ట్రాక్స్ లో ఇలా ఫోజిచ్చి హీట్ పెంచేస్తున్నారు. ఆ ఇద్ద‌రు భామ‌ల్ని సెల్ కెమెరాలో బంధిస్తున్న హీరోని గ‌మ‌నించారా? ఆ వెనుక మిర్ర‌ర్ లో యువ‌హీరో న‌వ‌దీప్ అలా ఫోటో తీస్తున్న వ్య‌వ‌హారం కూడా లీకైంది. సెల‌బ్రిటీ జిమ్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో వీరంతా శిక్ష‌ణ పొందుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఫిట్ నెస్ కాపాడుకోవ‌డంలో న‌వ‌త‌రం ఏమాత్రం అశ్ర‌ద్ధ చేయ‌డం లేదు. వెయిట్  గెయిన్  అవ్వ‌కుండా డైట్ తీసుకుంటారు. జిమ్ యోగా ష‌రా మామూలే. ఆ మ‌ధ్య రాశీ కాస్త బొద్దుగా మారుతోంద‌ని విమ‌ర్శ‌లు త‌లెత్తిన నేప‌థ్యంలో  వెంట‌నే జాగ్ర‌త్త ప‌డి  బ‌రువు త‌గ్గ‌డంపై దృష్టిపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ర‌ష్మిక కెరీర్ ఆరంభంలో ఇలాంటి వాటిపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. కాల‌క్ర‌మంలో కెరీర్ గ్రాఫ్ పెరుగుద‌ల‌తో పాటుగా పిట్ నెస్ అవ‌స‌రం ఏర్ప‌డింది.

అప్ప‌ట్లో `డియ‌ర్ కామ్రేడ్` సినిమా లో క్రికెట‌ర్ పాత్ర కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డింది. ఆ స‌మ‌యంలో ఎక్కువ‌గా జిమ్ లో వ‌ర్కౌట్ల‌పై శ్ర‌ద్ద పెట్టిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం  బాలీవుడ్ లో బిజీ కెరీర్ ని కొన‌సాగిస్తున్న క్ర‌మంలో మ‌రింత జాగ్ర‌త్త ప‌డుతోంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రాశీఖ‌న్నా `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్`.. `థాంక్యూ` చిత్రాల్లో న‌టిస్తోంది. కోలీవుడ్ లో అమ్మ‌డు చాలా బిజీగా ఉంది. ఐదారు సినిమాలు చేస్తోంది అక్క‌డ‌. అలాగే ర‌ష్మిక మంద‌న  `పుష్ప‌`..` ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది. బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను.. గుడ్ బాయ్ లాంటి చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రో రెండు చిత్రాల‌కు క‌మిట‌య్యాన‌ని ఇటీవ‌ల వెల్ల‌డించింది.
Tags:    

Similar News