అల్లు అర్జున్ కు రష్మీ దెబ్బ

Update: 2016-12-01 17:30 GMT
నిజంగానే.. ఈ మాటల్లో ఎంతమాత్రం అబద్ధం లేదు. కాకుంటే.. మీరు అనుకున్నట్లు ఎంత మాత్రం కాదు. తన మాటలతో బుల్లితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసే రష్మీ.. వెండి తెర మీద తన గ్లామర్ తో ఇరగదీసేస్తున్న వైనం తెలిసిందే. అమ్మడి బొమ్మ పుణ్యమా అని.. డబ్బాల్లో మూలుగుతున్న సినిమాలు సైతం కోట్ల రూపాయిల కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. ఆ ముచ్చటను పక్కన పెట్టి.. బన్నీని రష్మీ దెబ్బేసిన ఇష్యూలోకి వెళితే.. ఇది ఆసక్తికరమైన ముచ్చటే.

ఎలానంటే.. ఇప్పటివరకూ యూట్యూబ్ లో బాగా చూసిన పాటల్లో ‘సినిమా చూపిస్త మావా’ అంటూ బన్నీ రేసుగుర్రం సాంగ్ ఉంటుంది. సినిమా విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఆ పాటను యూట్యూబ్ లో 19,33,7012 సార్లు చూసేశారు. ఇప్పటివరకూ ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. తాజాగా యాంకర్ రష్మీ.. ఈ రికార్డును బ్రేక్ చేసేసింది. గుంటూరుటాకీస్ చిత్రంలో ‘నీ సొంతం’ పాటను ఏకంగా 20,30,863 సార్లు చేసేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక ఏడాది కంటే తక్కువ వ్యవధిలో ఈ పాటను ఇన్నిసార్లు చూసేయటం అంటే.. అందులో రష్మీ అందాలు ఎంతో సాయం చేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఏమైనా.. రష్మీ దెబ్బకు బన్నీ రికార్డు బ్రేక్ కూసింత సిత్రమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News