మాస్ మసాలా ఉంటేనే ఎక్కుతోంది

Update: 2017-10-31 07:02 GMT
ఈ రోజుల్లో సినిమాలో హీరోలు ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ తో ఉంటేనే అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొత్త తరహాలో ఉండడం కన్నా రఫ్ లుక్ తో ఉంటేనే ఆడియెన్స్ కి కిక్ వస్తోంది. హీరోలు ప్రయోగాలు చేయడానికి ఛాన్సులు బాగానే వస్తాయి. ఇక అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా అవకాశం వచ్చినప్పుడు బాగానే ప్రయోగాలు చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు కనిపించే మిగతా నటీమణులు కూడా కొత్తగా కనిపించాలని ట్రై చేస్తున్నారు.

బుల్లి తెరపై తన అందంతో అందరిని ఆకట్టుకున్న జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పుడు వెండితెరపై కూడా తన అందంతో ఘాటుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్మీని మాత్రం ఎక్కువగా వల్గర్ గా హాట్ గా చూపించడానికి దర్శకులు ఇష్టపడుతున్నారా? అంటే.. రష్మీ ఏ మాత్రం ఆలోచించకుండా అవును అలా ఉంటేనే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేను హాట్ గా కనిపించడానికి ఏమి ఇబ్బందిపడను అంటూనే వల్గర్ సీన్స్ మాత్రం చేయడానికి ఇబ్బందిపడినా చేయకతప్పలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది.

సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా ఇలాంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు మెల్లగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. హీరోలు కూడా వారు నటించిన సినిమాలోని మసాలా సీన్స్ గురించి అస్సలు ప్రస్తావించడానికి ఇష్టపడరు. కానీ రష్మీ మాత్రం మాస్ మసాలా ఉంటేనే ఆడియెన్స్ ఎక్కువగా ఎక్కుతోందని రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చెప్పేసింది. అంతే కాకుండా గుంటూరు టాకీస్ లో కూడా తాను వల్గర్ గా కనిపించలేదని చెప్పుకొచ్చింది.       
Tags:    

Similar News