అభిమాని గుండెల‌పై ర‌ష్మిక గాయం

Update: 2022-09-28 04:15 GMT
సౌత్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం బాలీవుడ్ లో హ‌వా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూనే రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌తో నేష‌న‌ల్ క్ర‌ష్ హాట్ టాపిక్ గా మారుతోంది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న గుడ్ బై ప్ర‌చారంలో ఉన్న ర‌ష్మిక తాజా యాక్ట్ హీటెక్కిస్తోంది. ర‌ష్మిక ఒక‌ అసాధారణమైన పని చేసి నెటిజనుల‌ హృదయాలను గెలుచుకుంది. త‌న వెంట‌ప‌డిన ఓ యువ‌ అభిమాని ఛాతీపై ర‌ష్మిక మంద‌న స్వీటెస్ట్ ఆటోగ్రాఫ్ ఇస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

అత‌డు మొద‌ట పుస్త‌కంపై ఆటోగ్రాఫ్ సేక‌రించాడు. ఆ త‌ర్వాత త‌న ష‌ర్ట్ విప్పి ఇన్న‌ర్ టీష‌ర్ట్ పై ర‌ష్మిక‌ను ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా ఎంతో ప్రేమ‌గా అడిగాడు. దానికి ర‌ష్మిక కాద‌న‌లేక‌పోయింది. వెంట‌నే అత‌డి గుండెల‌పై తీయ‌నైన సంత‌కం చేసింది. త‌న క‌ల‌ల రాణితో ఆ మ‌ధురాతి మ‌ధుర‌మైన జ్ఞాప‌కంగా అభిమాని గుండెల్లో ఎప్ప‌టికీ అలా ఉండిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

త‌న గుండెల‌పై ర‌ష్మిక ఆటోగ్రాఫ్ ఇస్తుండ‌గా ఆ అభిమాని మైమ‌రిచి ఆమె అందానికి విస్మయం చెందాడు. మరోవైపు రష్మిక కూడా తన యువ అభిమాని గుండెల‌పై సంతకం చేసి సంభాషిస్తున్నప్పుడు సిగ్గుల మొగ్గ‌గా మారి బుగ్గ‌లు ఎర్రబార‌డం క‌నిపించింది.

ఈ వీడియో క్ష‌ణాల్లో  వైరల్ అయింది. ప‌లువురు దానిపై స్పందించారు. ఒక  అభిమాని "ఆమె చాలా స్వీట్" అని వ్యాఖ్యానించ‌గా.. "ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది" అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు."చాలా క్యూట్" అని కొంద‌రు పొగిడేశారు. చాలా మంది గుండె ఎమోజీలను షేర్ చేసి వీడియోకు ప్రతిస్పందించారు.

మ‌రోవైపు ర‌ష్మిక న‌టించిన 'మిషన్ మజ్ను' విడుద‌ల కావాల్సి ఉంది.  ఇందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి యాక్ష‌న్ క్వీన్ గా స్పై పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అలాగే స్టార్ హీరో ర‌ణ‌బీర్ యానిమల్ లోను ర‌ష్మిక క‌థానాయిక‌. సందీప్ వంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస‌తున్నారు.  తమిళంలో రష్మిక తదుపరి చిత్రం విజయ్ తో వరిసు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అల్లు అర్జున్ తో పుష్ప 2 ఇప్పటికే చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News