ముంబైని షేక్ చేసిన ర‌ష్మిక 'వావ్ సామీ' స్టెప్

Update: 2021-12-17 06:09 GMT
ఈ ముంబైని ఉ* పోయించ‌డానికి వ‌చ్చాన‌ని డైలాగ్ చెబుతాడు బిజినెస్ మేన్ మ‌హేష్‌. ఇప్పుడు ర‌ష్మిక చేస్తోంది అదే. ఈ అందాల భామ ప్ర‌స్తుతం ముంబైని ఒణికిస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో అత్యంత క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు పుష్ప - ది రైజ్ చిత్రంతో ఉత్త‌రాది ఆడియెన్ ని క్లీన్ బౌల్డ్ చేయ‌బోతోంది.

అంత‌కుముందే ముంబై మీడియాకి నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. బాలీవుడ్ మీడియా చాలా కాలంగా ర‌ష్మిక‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తోంది. పుష్ప తో ఆ అవకాశం రానే వ‌చ్చింది. ఇక అవ‌కాశం దొర‌కాలే కానీ రష్మిక విడిచిపెడుతుందా? అదే ప‌నిగా చెల‌రేగుతోంది. బాలీవుడ్ మీడియాతో చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ స్వీట్ గా క్యూట్ గా ముంబై జర్నలిస్టులకు మ‌తులు చెడ‌గొడుతోంది! అన్నింటికంటే ముందు పుష్ప హైద‌రాబాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చేసిన పనిని మళ్లీ రిపీట్ చేసింది ర‌ష్మిక‌. ముంబై ఈవెంట్ లో హోస్ట్ `సామీ సామీ` సిగ్నేచ‌ర్ స్టెప్ ని నేర్పించమని కోర‌గా.. రష్మిక‌ వెంటనే వేదికపైకి వెళ్లి స్టెప్ వేసి చూపించింది. ఆ డ్యాన్స్ మూవ్ తో క‌ళ్ళు చెద‌ర‌గొట్టింది ర‌ష్మిక‌. మిరుమిట్లు గొలిపే ఆకుపచ్చ దుస్తుల్లో ర‌ష్మిక ఎంతో అందంగా క‌నిపించింది.

రష్మిక ఇంత‌కుముందు పోలీస్ గ్రౌండ్స్ లోని వేదికపై నల్ల చీరలో ఇదే స్టెప్ తో ఆక‌ట్టుకుంది. తన సామీ స్టెప్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇన్ స్టాలోనూ ఈ స్టెప్ ని షేర్ చేసింది. మొత్తానికి ర‌ష్మిక అన్నిచోట్లా ప్ర‌చార‌వేదిక‌ల‌పై అద‌ర‌గొడుతోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ అన్న ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తోంద‌నే చెప్పాలి. కొన్ని గంట‌ల్లోనే పుష్ప స‌మీక్ష కోసం తుపాకీని అనుస‌రించండి.
Tags:    

Similar News