మెగాస్టార్ చిరంజీవిది నాలుగు పదులు దాటిన సినీ కెరీర్. ఆయన 1977 నుంచి నటిస్తూనే ఉన్నారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి కొంత విరామం ప్రకటించినా రీ ఎంట్రీ తరువాత ఒక్కసారిగా జోరు పెంచేశారు. ఆయన చేతిలో ఇపుడు ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే యంగ్ హీరోలు కూడా కలవరపడాల్సిందే. చిరంజీవి అంటే ఒకపుడు ఏడాదికి ఎనిమిది నుంచి పది సినిమాలు చేశారు. అందుకే ఇపుడు ఆయన నూటాభై సినిమాలు సునాయాసంగా పూర్తి చేసి ఈ జనరేషన్ లో టాలీవుడ్ లో తనకు సాటి లేదని నిరూపించుకున్నారు. ఇక 2022లో ఆయన మూడు సినిమాలను థియేటర్లలోకి తేబోతున్నారని టాక్.
అయితే ఆయన నాటౌట్ అంటూ అలాగే దూసుకుపోతున్నారు. చిరంజీవి ఆచార్య మూవీని కంప్లీట్ చేసి కొత్త సినిమాల షూటింగ్స్ మొదలెట్టేశారు. ఇక ఇదే వరసలో 2023లో కూడా చిరంజీవి డైరీ ఫుల్ కంప్లీట్ అంటున్నారు. చిరంజీవి యువ దర్శకులకు కూడా చాన్స్ ఇస్తున్నారు. ఇపుడు భీష్మ ఫేమ్ డైరెక్టర్ వెంకట్ కుడుముల డైరెక్షన్ లో చిరంజీవి ఒక సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేశారని అంటున్నారు. ఈ మేరకు వెంకట్ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ చిరుకు బాగా నచ్చిందట.
సరే ఆ సంగతి అలా పక్కన పెడితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరంటే రష్మిక అంటున్నారు. ఇది నిజంగా ఆసక్తికరమైన న్యూస్ గానే చూడాలి. అయితే వెంకట్ కుడుముల తీసిన రెండు సినిమాల్లో కూడా రష్మికే హీరోయిన్. అసలు ఆమెను ఆయన చలో మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేశారు. భీష్మ మూవీ కూడా సూపర్ హిట్. దాంతో వెంకట్ కుడుముల మూవీ అంటే రష్మిక నో చెప్పే చాన్స్ లేదని అంటున్నారు. అయితే ఇక్కడ హీరో మెగాస్టార్. మరి ఆయన పక్కన రష్మిక అన్న వార్తలే సంచలనం అవుతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో ఈ మూవీ సెట్స్ మీదకు వచ్చే చాన్స్ ఉంది. మరి అప్పటికి కూడా ఇవే వార్తలు వినిపించినా ఇదే నిజమైనా కూడా దాని కంటే పెద్ద సంచలనం వేరేది ఉండబోదు. మొత్తానికి మెగాస్టార్ పక్కన రష్మిక నటిస్తే ఆ మూవీ విషయంలో ఒక్కసారిగా హైప్ క్రియేట్ కావడం ఖాయమే.