గీత గోవిందం .. డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ప్రేమికులుగా నటించి యువతరం మనసు దోచారు దేవరకొండ- రష్మిక జంట. ఆన్ ద స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ ద స్క్రీన్ కూడా ఆ ఇద్దరూ ప్రేమికులే అంటూ పొరపడిన సందర్భాలున్నాయి. నిజానికి రష్మికతో విజయ్ సింక్ అంతగా కుదిరింది. మరోసారి ఈ జంట కలిసి నటించేందుకు సమయమాసన్నమైంది.
అయితే కెరీర్ జర్నీలోనేనా.. ఆ ఇద్దరూ జిమ్ ను కలిసి పంచుకోవడం కసరత్తులు చేస్తూ ఫోజులివ్వడాన్ని అభిమానులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కుల్దీప్ సేథీ సరదాగా జిమ్ లో సెల్ఫీలు క్లిక్ చేస్తూ వాటినుంచి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అంకితభావం కృషితో ఏదైనా సాధ్యమే అంటూ ఇద్దరు స్టార్ల ఫోటోలను ఆయన షేర్ చేసారు.
పూరి జగన్నాథ్ `లైగర్` చిత్రానికి సంతకం చేసినప్పటి నుండి విజయ్ గత 2 సంవత్సరాలుగా జిమ్ లో కఠినంగా శ్రమిస్తున్నాడు. అతను మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా కనిపిస్తాడు. మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా రష్మిక గొప్ప ఫిట్ నెస్ ఫ్రీక్ గా వెలిగిపోతోంది. ఇద్దరూ తమ తదుపరి ప్రాజెక్ట్ లతో పాన్-ఇండియా స్టార్లుగా ఎదగనున్నారు.
ఏ స్టార్ హీరోకి తగ్గని రేంజులో..
విజయ్ దేవరకొండ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం LIGER (సాలా క్రాస్‌బ్రీడ్) కి ప్రముఖుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా నటిస్తున్నారు. దీనికోసం విజయ్ మార్షల్ విద్యల్లో శిక్షణ పొందారు. విజయ్ లుక్ అమాంతం మారింది. అతడు పూర్తిగా ఫిట్ బాడీతో కండలు పెంచి కొత్త రూపంతో అలరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే తో దేవరకొండ రొమాన్స్ చేస్తున్నారు. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ -ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్- చార్మి కౌర్- కరణ్ జోహార్ - అపుర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషలలో రూపొందుతున్న లైగర్ లో రమ్య కృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఇప్పటివరకూ లైగర్ విజువల్స్ చూసిన వారిలో ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. రెండు దశాబ్ధాల కాలంలో నేను చూసిన ఏ ఇతర స్టార్ కి తగ్గని రీతిలో విజయ్ దేవరకొండ లైగర్ లో కనిపించాడని ఆర్జీవీ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు... టైగర్ - లయన్ మధ్య సూపర్ క్రాస్ బ్రీడ్ అతడు అంటూ పొగిడేయడం ఆసక్తిని రేకెత్తించింది. కొన్ని సీన్లు చూసి ఆర్జీవీ ఆ రేంజులో పొగిడేశారు. అనన్య పాండే తండ్రి చుంకీ పాండే సైతం విజయ్ ని వాటే స్టార్.. ఇది పక్కా కమర్షియల్ సినిమా అంటూ పొగిడేశారు.
రష్మిక రెండు పడవల పయనం
వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ రష్మిక క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం `పుష్ఫ`లో అల్లు అర్జున్ సరసన, .. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో శర్వానంద్ తోనూ కలిసి నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ అమ్మడు పాగా వేస్తోంది. బాలీవుడ్ యువహీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `మిషన్ మజ్ను` లో నటిస్తోంది. అలాగే బిగ్ బి అమితాబచ్చన్ నటిస్తోన్న `గుడ్ బై` చిత్రంలో డాటర్ పాత్రను పోషిస్తోంది. మర రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేశానని నేషనల్ క్రష్ రష్మిక వెల్లడించింది.