ఫ్యాష‌నిస్టాలంతా కుళ్లుకుపోయేలా ర‌ష్మిక కిరాక్ లుక్

Update: 2020-10-12 01:30 GMT
రష్మిక మంద‌న ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.  ఇటీవ‌ల ఎక్క‌డికి వెళ్లినా షోస్టాప‌ర్ గా నిలుస్తోంది. ఏ అవతారంలో ద‌ర్శ‌న‌మిచ్చినా క‌ళ్ల‌న్నీ అటువైపే. క్యూట్ అప్పియ‌రెన్స్ తో ఈ అమ్మ‌డు సొంపుల సిరిలా ఊరించేస్తుంటే కుర్రాళ్లు క‌ళ్లు తిప్పుకోవ‌డం లేదు.

ఇదిగో లేటెస్టుగా స్ట‌న్నింగ్ లుక్ తో మ‌రోసారి కిరాక్ పుట్టించింది. ఫ్యాష‌నిస్టాలంతా కుళ్లుకుపోయేలా ర‌ష్మిక కిరాక్ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది లేటెస్ట్ గా. బ్లాక్ డ్రెస్ పైన‌ భారీ జాకెట్ ధ‌రించి ఫోటో  క్లిక్ కి దొరికింది. టాలీవుడ్ లో ఫ్యాషనిష్టా‌గా పేరు తెచ్చుకుంటోంది ఈ భామ‌.  రెడ్ కార్పెట్ ఈవెంట్ లేదా సాధారణం విహారయాత్ర అయినా.. ది బెస్ట్ అనిపిస్తోంది.

ఇక కెరీర్ సంగ‌తి చూస్తే బెస్ట్ ఫేజ్ లో ఉంది. 2020 ఎవ‌రికి క‌లిసి రాక‌పోయినా ర‌ష్మిక‌కు మాత్రం క‌లిసొచ్చింది. ఆరంభ‌మే రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఖాతాలో వేసుకుంది. స‌రిలేరు నీకెవ్వ‌రు- భీష్మ రూపంలో చ‌క్క‌ని విజ‌యాలు క‌లిసొచ్చాయి. త‌దుప‌రి పుష్ప లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ క‌థానాయ‌కుడు. ఎర్ర చంద‌నం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ట్రక్ డ్రైవర్ పాత్రలో బ‌న్ని క‌నిపించ‌నున్నారని సమాచారం.


Tags:    

Similar News