రష్మిక మందన్న బాలీవుడ్ కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన స్టార్ డమ్ కొనసాగిస్తూనే సైమల్టేనియస్ గా ఉత్తరాదినా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. నేము ఫేము ఉన్నంత కాలం తెలుగు సినిమాల్లో నటించి చివరిగా బాలీవుడ్ లో స్థిరపడిపోవాలని ఈ బ్యూటీ తెలివైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`..`గుడ్ బై` చిత్రాల్లో నటిస్తోంది. కొత్త కమిట్ మెంట్లకు సంబంధించి సీరియస్ గా కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరణ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయంలో రష్మిక ప్రత్యక్షమైంది. ఆ సంస్థతో రష్మిక ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో సహకరిస్తున్నది ఓ ప్రముఖ తెలుగు హీరో అంటూ ఠాంఠాం మోగుతోంది. రష్మకకి- అతడు చాలా క్లోజ్ ప్రెండ్. స్నేహాన్ని మించిన బాండింగ్ వాళ్లిద్దరి మధ్య ఉందని ఇప్పటికే ప్రచారం ఉంది. జంటగా ఒక బ్లాక్ బస్టర్ లో ఒక ఫ్లాప్ సినిమాలో నటించారు. సదరు హీరోగారి ఫ్యామిలీకి రష్మిక బాగా క్లోజ్. ఆ కారణంగా ధర్మ ప్రొడక్షన్స్ కి రష్మిక పేరును రిఫర్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం కరణ్ జోహార్ తో కలిసి అతడు పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు. మునుముందు ధర్మాధినేతతో ఈ బాండింగ్ ఇలానే కొనసాగుతుంది. ఇదే స్నేహం కారణంగానే రష్మికని ధర్మ ప్రొడక్షన్ కి రిఫర్ చేసినట్లు బలమైన ప్రచారం సాగుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తేలాల్సి ఉంది. రష్మిక ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` రెండవ భాగంలో నటిస్తోంది. అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రంలోనూ నటిస్తోంది. మరికొన్ని కొత్త ప్రాజెక్టు లకు సంతకాలు చేసింది. పుష్ప 2 ఏప్రిల్ నుంచి సెట్స్ కెళుతుంది కాబట్టి అప్పటికి అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. మరిన్ని తెలుగు -హిందీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అయితే వాటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచింది. ఈ ఏడాది వాటి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.