అలాంటి సినిమాతో త్వరలో రష్మిక షాక్ ఇవ్వబోతుందా..!

Update: 2023-01-19 16:30 GMT
కన్నడ భామ రష్మిక లేటెస్ట్ గా జర్నలిస్ట్ ప్రేమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. రష్మిక మీద కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ కు, ట్రోల్స్ కి ఇది ఒక ఆన్సర్ గా ఉంటుందని టాక్. విజయ్ దేవరకొండతో లవ్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిల మీద తన గొడవ ఇలా అన్నిటికీ ఈ ఇంటర్వ్యూతో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో తన అభిమానులకు ఒక సూపర్ న్యూస్ చెప్పింది రష్మిక. నీ నుంచి ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆశిస్తున్నామని ప్రేమ అడుగగా.. త్వరలోనే అది జరుగుతుందని చెప్పింది రష్మిక.

అయితే దాని గురించి డీటైల్స్ మాత్రం చెప్పలేదు. రష్మిక అలా చెప్పడంతో ఆమె చేయబోయే లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏమై ఉంటుందా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అంతేకాదు ఆ సినిమాకు దర్శకుడు ఎవరు.. నిర్మాత ఎవరు.. ఇలా పలు రకాల ప్రశ్నలతో హడావిడి చేస్తున్నారు. రష్మిక మాత్రం సింపుల్ గా త్వరలోనే ఆ సినిమా గురించి తెలుస్తుందని చెప్పింది. ఇక బాలీవుడ్ లో తన సినిమాల గురించి చెప్పిన రష్మిక గుడ్ బై సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చకపోయినా కొన్నేళ్ల తర్వాత అలాంటి సినిమాలు రావాలని అనుకుంటారని చెప్పింది.

పుష్ప 2లో తన పాత్ర గురించి కూడా కొంత క్లూ ఇచ్చింది శ్రీవల్లి. ఇక సందీప్ వంగ యానిమల్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని. రణ్ బీర్ కపూర్, తను ఇద్దరు తమ పాత్రలతో షాక్ ఇస్తామని చెప్పింది. ఇదే కాదు ఇంకా చాలా విషయాలతో రష్మిక జర్నలిస్ట్ ప్రేమ ఇంటర్వ్యూ జరిగింది. అయితే ప్రస్తుతం ప్రోమో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలోనే ఆడియన్స్ కు కావాల్సిన కంటెంట్ ఉందని అర్థమైంది.

ముఖ్యంగా తనకు మొదట ఛాన్స్ ఇచ్చిన రక్షిత్, రిషబ్ శెట్టిల గురించి చాలా కాలం తర్వాత మాట్లాడింది రష్మిక. ఈ ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ది హైలెట్ అంటే అదే అని చెప్పొచ్చు. మరి ఇంకా ప్రేమ ఏయే విషయాల గురించి రష్మిక నుంచి ఆన్సర్స్ రప్పించిందో ఇంటర్వ్యూ చూస్తే అర్ధమవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News