నేష‌న‌ల్ క్ర‌ష్ జోరు మామూలుగా లేదుగా!

Update: 2022-07-09 01:30 GMT
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళుతున్న క్రేజీ హీరోయిన్‌ ర‌ష్మిక మంద‌న్న‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ల‌భించిన క్రేజ్ కార‌ణంగా నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకోవ‌డం మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే మూడు భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న తాజాగా మ‌రో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

`పుష్ప‌` క్రేజ్ తో ర‌ష్మిక  సొంతం చేసుకున్న తొలి బాలీవుడ్ మూవీ `మిష‌న్ మ‌జ్ను`. ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సిద్ధార్ధ్ మ‌ల్హొత్రా హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాని శంత‌ను బ‌గ్చి రూపొందిస్తున్నారు.

పాకిస్థాన్ నేప‌థ్యంలో సాగే సీక్రెట్ ఆప‌రేష‌న్ క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ క‌రోనా కార‌ణంగా రిలీజ్ డిలే అవుతూ వ‌స్తోంది. జూన్ లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో వాయిదా వేశారు.  

`మిష‌న్ మ‌జ్ను` తో బాలీవుడ్ లో తొలి ఆఫ‌ర్ ని సొంతం చేసుకున్న ర‌ష్మిక అదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌ని లైన్ లో పెట్టేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తొలి బాలీవుడ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న‌ నేప‌థ్యంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న `గుడ్ బై`లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ ని రీసెంట్ గా పూర్తి చేసేసింది. దీని త‌రువాత వెంట‌నే ర‌ణ్ బీర్ క‌పూర్ తో సందీప్‌ రెడ్డి  వంగ రూపొందిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `యానిమ‌ల్`లో న‌టించే అవ‌కాశాన్నిద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే ర‌ష్మిక మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకోవ‌డం విశేషం. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా శ‌శాంక్ ఖేతాన్ ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది.

శ‌శాంక్ ఖేతాన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంద‌ని ర‌ష్మిక‌ని ఫైన‌ల్ చేశార‌ట‌. ర‌ష్మిక బాలీవుడ్ లైన‌ప్ చూసిన వారంతా నేష‌న‌ల్ క్ర‌ష్ జోరు మామూలుగా లేదుగా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే త్వ‌ర‌లో షూటింగ్‌ ప్రారంభం కానున్న `పుష్ప 2`లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News