ఎందరిని రిజెక్ట్ చేస్తే నాకేంటి?

Update: 2018-08-18 01:30 GMT
‘గీత గోవిందం’ సినిమాకు రష్మిక మందానాను కథానాయికగా ఎంచుకోవడానికి ముందు గీత పాత్ర కోసం దాదాపు 25 మంది హీరోయిన్లను సంప్రదించినట్లుగా ఇటీవలే వెల్లడించాడు దర్శకుడు పరశురామ్. ఒక క్యారెక్టర్ కోసం మరీ అంత మందిని అడిగి నో చెప్పించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పరశురామ్ అడిగేటప్పటికి ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకపోవడంతో విజయ్ పక్కన నటించడానికి కొందరు విముఖత వ్యక్తం చేశారట. అయినప్పటికీ అప్పటికి అతను ‘పెళ్లిచూపులు’ లాంటి హిట్ కొట్టాడు. పైగా ఈ చిత్రం గీతా ఆర్ట్స్-2 బేనర్లో తెరకెక్కింది. అయినా అంతమంది హీరోయిన్లు తిరస్కరించడం ఆశ్చర్యమే. ఐతే చివరికి రష్మిక ఈ సినిమాకు ఓకే అయింది. ఆమె డేట్లు సర్దుబాటు చేసేసరికి ఇంకో మూడు నెలలు ఆలస్యమైంది.

మరి ఇంతమంది నో చెప్పిన సినిమాను మీరెలా ఒప్పుకున్నారు.. వేరే వాళ్లు కాదన్న సంగతి మీకు తెలుసా అని అడిగితే ఆసక్తికర సమాధానాలు చెప్పింది రష్మిక. ఈ పాత్రను కొందరు వద్దన్నట్లు దర్శకుడు తనకు ముందే చెప్పాడని ఆమె వెల్లడించింది. కానీ ఎంతమంది రిజెక్ట్ చేస్తే నాకేంటి అని ఆమె ప్రశ్నించింది. తాను ఎవరిని రీప్లేస్ చేస్తున్నానన్నది కూడా పట్టించుకోనని చెప్పింది రష్మిక. తనకు గీత పాత్ర నచ్చిందని.. దీంతో తానీ సినిమా చేయాలనుకున్నానని.. పైగా తాను ఓకే అన్నాక తానే ఈ పాత్ర చేయాలని దర్శకుడు సినిమా మొదలుపెట్టకుండా మూడు నెలల పాట్లు డేట్ల కోసం ఎదురు చూడటం కూడా తనకు నచ్చిందని ఆమె అంది. ‘గీత గోవిందం’ తన కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమా అని.. గీత పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆమె అంది. ‘గీత గోవిందం’ ఇంత పెద్ద విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని.. తెలుగులో తాను ప్రస్తుతం నటిస్తున్న‘డియర్ కామ్రేడ్’.. ‘దేవదాస్’ సినిమాల్లోనూ తన పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయని ఆమె చెప్పింది.
Tags:    

Similar News