మాటిస్తే.. పూర్తి చేసే వరకూ మర్చిపోదట

Update: 2020-02-17 07:45 GMT
మాట ఇవ్వటం.. దాన్ని అలా వదిలేయటం చాలామందిలో చూస్తుంటాం. కానీ..కొంతమంది మాట ఇస్తే చాలు.. ఎంత నష్టమైనా.. కష్టమైనా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం అమితంగా శ్రమిస్తుంటారు. అలాంటి కోవకే చెందుతుంది రష్మిక మందాడ. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ఒక అలవాటు ఉందట. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే మాత్రం.. దాన్ని నెరవేర్చుకోవటం కోసం ఎంతవరకైనా వెళతారట.

ఛలో తర్వాత వెంకీ కుడుముల తర్వాతి సినిమా చేస్తానని తాను చెప్పానని.. దానికి తగ్గట్లే ఇచ్చినమాటను నిలబెట్టుకోవటం కోసం సినిమా చేశానని చెప్పింది. వరుసగా సినిమాలు చేయటంతో కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

హిందీ జెర్సీలో తనకు అవకాశం వచ్చిందని.. కానీ ఇచ్చిన మాట కోసం సినిమా చేయటం వల్ల ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు చెప్పింది. తనతో సినిమాలు చేసిన దర్శకులు మళ్లీ సినిమాలు చేయాలనుకోవటం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పింది. నితిన్ తో పని చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ.. చాలా కూల్ గా షూట్ సాగిందన్నారు. కాలేజీకి వెళ్లే అబ్బాయిల నితిన్ ఉన్నారని.. తనతో పని చేయటం చాలా సౌకర్య వంతంగా ఉందని చెప్పారు.
Tags:    

Similar News