వారి గురించి నోరు విప్పిన రష్మిక..!

Update: 2023-01-19 02:30 GMT
కన్నడ భామ రష్మిక గురించి ఈమధ్య రకరకాల ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. తనకు ఛాన్స్ ఇచ్చిన మొదటి సినిమా మేకర్స్ గురించి.. సౌత్ సినిమాల పాటల గురించి ఇలా ఏదో ఒక విధంగా రష్మిక ఈమధ్య సోషల్ మీడియా ట్రోల్స్ కు బలవుతుంది. అయితే వీటిపై ఆమె ఎంత క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నా సరే కుదరడం లేదు. ఫైనల్ గా ఓ ఇంటర్వ్యూతో తనపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మిక.

రష్మిక తో జర్నలిస్ట్ ప్రేమ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో రష్మిక ఇదివరకు ఎప్పుడు ఓపెన్ అవనంతగా తన విషయాల గురించి చెప్పింది. ముఖ్యంగా తను ఈ పరిశ్రమ రావడానికి కారణమైన రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిల గురించి మొదటిసారి నోరు విప్పింది రష్మిక. రష్మిక మొదటి సినిమాను డైరెక్ట్ చేసింది కాంతార ఫేం రిషబ్ శెట్టి. అయితే ఈమధ్య కాంతారాతో సూపర్ హిట్ అందుకోగా ఆ సినిమా గురించి రష్మిక కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదని ఆమెపై కన్నడ ప్రేక్షకులు ట్రోల్స్ చేశారు.

ఇక రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన రష్మిక ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. కారణాలు ఏమైనా రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిల విషయంలో రష్మిక అంత యాక్టివ్ గా లేదు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి విచిత్రమైన సైన్ చేసిందని రిషబ్ కూడా కాంతార ఇంటర్వ్యూలో రష్మిక గురించి అదే సైన్ చేశాడు.

అయితే ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేలా రష్మిక తనకు అసలు సినిమా అంటే ఏంటో తెలియని టైం లో రక్షిత్, రిషబ్ శెట్టిలు హెల్ప్ చేశారు. వారి వల్లే తనకు సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో తెలిసిందని అన్నది. చెప్పాల్సిన చోట చెప్పాల్సిన టైం కు చెప్పాల్సిన విషయాన్ని చెబుతారు తప్ప ఎవరో అడిగారని ఏమి చెప్పారు. రష్మిక ఈ ఇంటర్వ్యూలో రిషబ్, రక్షిత్ లను గుర్తు చేసుకుంటూ మాట్లాడటం ఆమె మనసులో వారి పై ఎలాంటి ధ్వేషం లేదని అర్థమవుతుంది. మరి కన్నడ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News