యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా మధ్య సంబంధం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 'గీత గోవిందం' చిత్రంలో రొమాన్స్ చేసిన ఈ జోడీ.. 'డియర్ కామ్రేడ్' లో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి. అలానే తరచుగా ఇద్దరూ కలిసి చక్కర్లు కొడుతూ కెమెరా కళ్ళకు చిక్కడంతో.. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఇప్పటికే రష్మిక - విజయ్ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాలపై వస్తున్న రూమర్స్ పై పలు సందర్భాల్లో స్పందించారు. తామిద్దరం స్నేహితులమే అని చెప్పారు. అయినప్పటికీ ఈ రూమర్స్ కు చెక్ పడలేదు. ఎక్కడికెళ్లినా వీటి గురించే ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోలో వీడీ ఈ విషయం మీద మాట్లాడగా.. ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పుకార్ల గురించి రష్మిక మందన్నాను అడిగారు. దీనికి రష్మిక స్పందిస్తూ.. ప్రజలు మన గురించి చెత్తగా మాట్లాడగలరు. వారిని నవ్వించడానికే ఇష్టపడతానని తెలిపింది. ''నేను సంవత్సరానికి ఐదు సినిమాలు చేస్తున్నాను, కానీ మీరు ఇంకా వచ్చి నన్ను 'ఎవరితో డేటింగ్ చేస్తున్నారు?' 'మీ వ్యక్తిగత జీవితం ఏమిటి?' అని అడుగుతారు''
''మేం నటులమని.. మా గురించి మరింత తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉందని నేను అర్థం చేసుకోగలను. నా కెరీర్ ప్రారంభం నుండి ఇది అలాగే ఉంది… ఆమె ఎవరిని చూస్తోంది? లేదా ఆమె ఈ వ్యక్తితో ఉందా? అని ఆలోచిస్తుంటారు. నటీనటులు లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి మీరు దాని గురించి మాట్లాడవచ్చు. కానీ నా విషయానికి వస్తే, నేను నా మాటల్లో చెప్పేంత వరకు కన్క్లూజన్ కు రావద్దని వారికి చెప్పాలనుకుంటున్నాను'' అని రష్మిక చెప్పింది.
''మీరు దీని గురించి ప్రతికూల విషయాలు చెప్పవచ్చు. ఎందుకంటే అంతిమంగా మేం పబ్లిక్ ఫిగర్లం. మేము కేవలం మంచి బిట్లను ఎంచుకోలేము.. ప్రజలు కేవలం పనిపై దృష్టి పెడతారు.. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతారు. వారికి దేని గురించి మాట్లాడటానికైనా స్వేచ్ఛ ఉంటుంది కానీ.. వెంటనే ఒక నిర్ధారణకు రాకండి. మీరు నా మాట విననంత వరకు అది నిజం కాదు'' అని రష్మిక చెప్పుకొచ్చింది.
ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ - సారా అలీ ఖాన్ ఎపిసోడ్ లో మరియు 'లైగర్' జోడీ ఎపిసోడ్ లోనూ రష్మికతో విజయ్ దేవరకొండ సంబంధం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ''కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశాను. షూటింగ్ లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్ గురించి.. జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం'' అని తెలిపారు.
ఇక రష్మిక విషయానికొస్తే.. లేటెస్టుగా 'సీతా రామం' సినిమాతో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 'వారసుడు' అనే బైలింగ్విల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో 'మిషన్ మజ్ను' - 'గుడ్ డే' మరియు 'యానిమల్' వంటి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇదే క్రమంలో 'పుష్ప 2' సినిమా చేయనుంది రష్మిక.