హీరో నితిన్ తన నెక్స్ట్ సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 'భీష్మ' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లోనే ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు గానీ ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో దర్శకుడిని అందరూ సినిమా గురించి అడగడం మొదలు పెట్టారట. ఈ విషయం పై స్పందించిన వెంకీ కుడుముల తన ట్విట్టర్ క్లారిటీ ఇచ్చాడు.
"#భీష్మ గురించి చాలామంది అడుగుతున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. నితిన్ అన్న భుజానికైన గాయం నుండి కోలుకుంటున్నాడు. ఈమధ్యే ఎక్సర్ సైజులు చెయ్యడం మొదలు పెట్టాడు. రష్మిక ఎప్పటిలాగే షూటింగులతో బిజీగా ఉంది. త్వరలో ఈ సినిమాను ప్రారంభిస్తాం" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన రష్మిక "నేను ఫుల్ గా ఎగ్జైట్ అయి ఉన్నా.. అయ్యో నితిన్ సర్ నాకు తెలీదు.. మీరు ఇప్పుడు బాగున్నారు కదా? మీరు ఇపుడు బెటర్ గా ఉన్నారని ఆశిస్తున్నా. వెంకీ కుడుముల.. నేను షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పింది.
ఈ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన నితిన్ "హేయ్ రష్మిక. నేను ఇప్పుడు బెటర్ గా ఉన్నా. షూటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. షూటింగ్ లో కలుసుకుందాం. వెంకీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?" అంటూ ఇద్దరితో చాట్ చేశాడు. మొదటి సినిమా 'ఛలో' తో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించిన వెంకీ కుడుములకు ఇది రెండో సినిమా కోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఉంది. ఫ్లాపులతో సతమతమౌతున్న నితిన్ కు ఈ సినిమా విజయం తో కాస్త రిలీఫ్ ఇస్తాడేమో వేచి చూడాలి.