రాశిఖన్నా.. ఈ టాలీవుడ్ యువనటి కేవలం నటనలోనే కాదు.. గాయనిగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది. గతంలో తన ఐదు చిత్రాల్లో పాటలు పాడి అలరించింది. నైపుణ్యం గల గాయని అనిపించుకుంది.
ప్రస్తుతం మహమ్మారి రాకతో వచ్చిన నిర్బంధంలో రెండు నెలలుగా ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఈ పంజాబీ అందం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటోంది. తనలోని సంగీత అభిలాషకు మరింత పదును పెడుతూ సంగీతాన్ని అవపోసన పడుతోంది. గిటార్ తో ప్రయోగాలు చేస్తోంది.
ఈ క్లిష్టమైన ఖాళీ టైంలో వీకెండ్ లో తాజాగా రాశిఖన్నా ఓ సెల్ఫీ వీడియోను అభిమానులతో పంచుకుంది. గిటార్ వాయిస్తూ ‘గెట్ యూ ది మూన్’ అనే పాట పాడి అలరించింది.
గిటార్ ను నెమ్మదిగా వాయిస్తూ.. తనకు ఇష్టమైన పాటను ఎంతో హృద్యంగా స్మూత్ గా తెరచాటున రాశిఖన్నా పాడిన ఆ పాట పరవశించేలా ఉంది. ‘మీరు ఈ ప్రయత్నం ఇష్టపడుతారని ఆశిస్తున్నాను’ అంటూ తన పాట వీడియోను షేర్ చేసింది. రాశి గొంతు నుంచి జాలువారిన ఆ ఓదార్పు సంగీతం అందరి హృదయాలను తాకేలా ఒక కెరటంలా సాగిపోయింది. మీరూ ఈ పాట విని ఆ అనుభూతి పొందండి..
Full View Full View