ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ అనే విషయం తెల్సిందే. ఆ ప్రేమ వ్యవహారాలు కొన్ని సార్లు సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఒక హీరో తనకు జోడీగా పలానా హీరోయిన్ కావాలంటూ మేకర్స్ ను ఒత్తిడి చేయడం చాలా సందర్బాల్లో చూశాం. తెలుగు హీరోల నుండి మొదలుకుని అన్ని భాషల సినిమాల హీరోలు కూడా మాకు ఆ హీరోయిన్ మాత్రమే కావాలంటూ అడిగిన సందర్బాలు ఉంటాయి. అలా అడగడంకు కారణం ఆ హీరోయిన్ తో రిలేషన్ లో ఉండటం లేదా తమ తో ఉన్న రిలేషన్ లో ఉన్న హీరోయిన్ కు ఆ హీరోయిన్ తో సంబంధాలు కలిగి ఉండటం.. కారణం ఏదైనా కూడా సినిమాల్లో హీరోయిన్ ఎంపిక విషయంలో హీరోలు మరియు వారి ప్రేమ వ్యవహారాలు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయనే టాక్ ఉంది. తాజాగా సీనియర్ హీరోయిన్ రవీనా టండాన్ ఆ విషయాన్ని క్లారిటీ చేసింది. ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక షో కోసం ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఆ షో ప్రమోషన్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను ఆమె మీడియా ముందుకు వచ్చి షేర్ చేసుకుంది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
నేను ఒక స్టార్ హీరోతో కలిసి చేయాల్సిన రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. అప్పటికే మా ఇద్దరి కాంబోలో సూపర్ హిట్స్ పడ్డాయి. మా ఇద్దరి పెయిర్ ను హిట్ పెయిర్ గా అంతా అంటున్న సమయంలో ఆయన తో కలిసి నటించే అవకాశం మళ్లీ వచ్చినప్పుడు నేను ఓకే చెప్పాను. కాని షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంకు నాకు కాకుండా మరో హీరోయిన్ కు ఆ అవకాశం వెళ్లింది అంటూ మేకర్స్ ప్రకటించారు. దాంతో నేను అవాక్కయ్యాను. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటీ అంటే ఆయన ప్రియురాలు అయిన హీరోయిన్ కోసం నన్ను తప్పించారట. ఆమె విజ్ఞప్తి మేరకు హీరో మరియు దర్శకుడు సినిమా నుండి నన్ను పక్కన పెట్టారని తెలిసింది. ఆ ఒక్క సినిమా కు మాత్రమే కాకుండా నన్ను చాలా సినిమాలకు కూడా పక్కన పెట్టారు. సినిమాల్లో ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారడం ఆమద్య చాలానే జరిగేవి. హీరోల స్నేహితులు.. ప్రియురాల్లకు నచ్చక కొన్ని పరిస్థితుల్లో సినిమాలను వదిలేస్తే మరి కొన్ని సమయంలో దర్శక నిర్మాతల అవసరాలకు తగ్గట్లుగా హీరోయిన్స్ ను ఎంపిక చేసే వారు. అలాంటి సమయంలో కూడా వచ్చిన అవకాశాలు జారి పోయాయి అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
హీరోయిన్ గా రవీనా టండాన్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అక్షయ్ కుమార్ తో ప్రేమాయణం సాగించిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇద్దరి బ్రేకప్ కు కారణాలు తెలియరాలేదు కాని కొన్నాళ్లకే ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహం అన్నట్లుగా అయ్యారు. ఇక అక్షయ్ కుమార్ తో శిల్ప శెట్టి ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలో రవీనా టండాన్ కు దక్కాల్సిన అవకాశాలు ఆమె ఏమైనా తప్పించిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ మరియు శిల్ప శెట్టిల ప్రేమాయణం కూడా పూర్తి వరకు కొనసాగలేదు. కాని ఇద్దరు కూడా సుదీర్ఘ కాలం పాటు ప్రేమలో ఉన్నారు. అప్పుడే అక్షయ్ కుమార్ సినిమాల విషయంలో ఆమె నిర్ణయాలు తీసుకునేది అంటూ వార్తలు వచ్చేవి. కనుక ఇప్పుడు రవీనా చెబుతున్న ఆ పేరు లేని హీరోయిన్ శిల్ప శెట్టి అయ్యి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటీ అనేది ఆమె నోరు విప్పితే కాని తెలియదు.