ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, ముఖేష్ రుషి పొరుగు నుంచి తెలుగు పరిశ్రమకి వచ్చి సక్సెసైన ఆర్టిస్టులు. విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించారు. అయితే వీళ్లకు రీప్లేస్ మెంట్ లేదా? అనుకుంటున్న టైమ్ లో అనూహ్యంగా తెరపైకి దూసుకొచ్చాడు రవికిషన్ జీ..! 'రేసుగుర్రం' సినిమాలో విలన్ గా నిరూపించుకున్నాడు. బన్నితో పోటీపడి అతడు నటించిన తీరు ఆకట్టుకుంది. రవికిషన్ లోని ఫైర్ అందరినీ మెప్పించింది. రేసుగుర్రానికి సరిజోడు దొరికాడే అని ప్రశంసించారంతా.
వాస్తవానికి రవికిషన్ విలన్ కానేకాదు, అతడు బోజ్ పురిలో 300 పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. హిందీలో దాదాపు 50 సినిమాల్లో విభిన్నమైన క్యారెక్టర్ల లో రాణించాడు. ఇంతకాలానికి తెలుగు పరిశ్రమలో సురేందర్ రెడ్డి అవకాశం ఇవ్వడంతో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నిరూపించుకుని ఇప్పుడున్న విలన్లందరికీ రీప్లేస్ మెంట్ అయిపోయాడు. త్వరలో రిలీజ్ కి వస్తున్న కిక్2లో విలన్ అతడే. బాలయ్య డిక్టేటర్ లోనూ విలన్ గా నటిస్తున్నాడు. ఇంకొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ విషయాలన్నీ రవికిషన్ స్వయంగా చెప్పాడు.
ఇదంతా సురేందర్ రెడ్డికి దక్కాల్సిన క్రెడిట్ అంటూ వినమ్రతను చాటుకున్నాడు. డిక్టేటర్ లో ఇల్లీగల్ బిజినెస్ చేసే విలన్ గా ఆకట్టుకుంటానని చెప్పుకొచ్చాడు. ఏ పాత్ర చేసినా ఎమోషన్ పీక్ లో ఉండేలా చేయగలిగే సత్తా ఉంది. అలాంటి అవకాశాలు కావాలని అడుగుతున్నాడు. ప్రతిభకు ఎప్పుడూ అవకాశాలుంటాయిక్కడ. రవికిషన్ పెద్ద విలన్ గా ఎదుగుతాడనడంలో సందేహం లేదు.