మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ విడుదల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రాన్ని నవంబరు 16న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న రిలీజ్ చేసిన టీజర్లో ప్రకటించారు. ఇది మాస్ రాజా అభిమానులకు సంతోషకరమైన వార్తే. ఎందుకంటే ఈ చిత్రం డిసెంబరు నెలాఖరుకు వాయిదా పడ్డట్లుగా వార్తలొచ్చాయి. ఆ ప్రచారానికి తెరదించుతూ సినిమాను త్వరగానే రిలీజ్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. నవంబరు 16నే విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘ట్యాక్సీవాలా’ కూడా విడుదల కాబోతోంది. రవితేజ-విజయ్ మధ్య రసవత్తర బాక్సాఫీస్ పోరు ఖాయమని భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం.
నిజానికి ఈ నెలలోనే వీళ్లిద్దరి మధ్య పోరు ఉంటుందని అనుకున్నారు. అక్టోబరు 5న విజయ్ సినిమా ‘నోటా’ విడుదలకు ముహూర్తం చూసుకోగా.. అంతకంటే ముందే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని అదే తేదీకి షెడ్యూల్ చేసి పెట్టారు. కానీ తర్వాత ఆ సినిమాను వాయిదా వేయడంతో.. విజయ్ సినిమాతో పోటీ విషయంలో భయపడ్డారని ఊహాగానాలు వచ్చాయి. కానీ నిజానికి సినిమా ఆ సమయానికి రెడీ కాకపోవడం వల్లే వాయిదా పడినట్లు చిత్ర బృందం చెప్పింది. ఐతే ‘నోటా’కు పోటీగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వచ్చి ఉంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండేది కాదని ఆ సినిమా ఫలితం రుజువు చేసింది. ఇప్పుడు ‘నోటా’ ఎదురు దెబ్బ తర్వాత.. ‘ట్యాక్సీవాలా’ పెద్దగా అంచనాల్లేకుండా వస్తోంది. దాంతో పోలిస్తే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కే హైప్ కనిపిస్తోంది. ఇప్పుడు రవితేజను చూసి విజయే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఎలాగైతేనేం మిస్ అయిందుకున్న రవితేజ-విజయ్ పోరును ఈసారి పక్కాగా చూడబోతున్నాం. చూద్దాం ఎవరు పైచేయి సాధిస్తారో?