మాస్ మహారాజా రవితేజ కెరీర్ కీలక మలుపు లో ఉన్న సంగతి తెలిసిందే. సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం చాలాకాలంగా తర్జనభర్జన పడుతున్న రవితేజ ఇప్పుడు పూర్తిగా కరెక్షన్ మోడ్ లో ఉన్నాడట. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `డిస్కో రాజా` చిత్రంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ సాగుతోంది. రీషూట్లు.. కరెక్షన్ అంటూ రాజాలో కొంత మీమాంశ ఇబ్బందిపెడుతోంది అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. అయితే ఇది నిజమా? అంటే .. అవును .. అవసరం మేర కరెక్షన్స్ చేస్తున్నారన్న మాటా ఇన్ సైడ్ వినిపిస్తోంది.
ఇటీవల రవితేజకు ఫేస్ ఛేంజ్ అవ్వడం లేదు. `రాజా దిగ్రేట్` తరువాత రవితేజ కెరీర్ మరీ నత్తనడకన సాగుతోంది. బ్లాక్ బస్టర్ ఆశిస్తే.. అసలు ఏదీ కలిసి రావడం లేదు. అందుకే `డిస్కోరాజా` విషయంలో ఒకటికి పదిసార్లు రివ్యూలు చేసుకుంటున్నారట. అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్పీడ్ పెంచాలని రవితేజ భావిస్తున్నాడు. అయితే డిస్కో రాజా స్క్రిప్ట్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యం కావడంతో చిన్నపాటి రిస్క్ ని ఫేస్ చేయాల్సి వస్తోంది. ఈ చిత్రంలోని సైంటిఫిక్ అంశాల్లో స్పష్టత లోపించడంతో రవితేజ సంతృప్తి గా లేరని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అందుకే రీషూట్ లు చేయాలని రవితేజ దర్శకుడితో వాదిస్తున్నారట.
తాజాగా రీషూట్ పని మొదలైందన్న మాటా వినిపిస్తోంది. రవితేజ మార్కు వినోదం.. మేనరిజమ్స్‌తో పాటు వి.ఐ. ఆనంద్ స్క్రీన్‌ప్లే మెరుపులతో `డిస్కోరాజా`ని ముస్తాబు చేస్తున్నారు. అన్నీ పర్‌ఫెక్ట్ గా బ్లెండ్ అయితే మాస్‌రాజా కు పర్ ఫెక్ట్ హిట్ పడినట్టే. అన్నట్టు ఈ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఆ సమయానికి రెడీ చేయాలని దర్శకుడు రీషూట్ ల పని పెండింగ్ పని వేగంగా పూర్తి చేస్తున్నారట. ఇవన్నీ పూర్తయితే ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాల్సిందే.
`ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి. ఐ. ఆనంద్ ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. అతడు ప్రతిసారీ ఇన్నోవేటివ్ గా కొత్త తరహా కథల్నే ఎంచుకుంటున్నారు. `డిస్కోరాజా` చిత్రానికి కూడా కొత్త నేపథ్యాన్నే ఎంచుకున్నారు. 90వ దశకం బ్యాక్ డ్రాప్‌లో రవితేజ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ ఈ సినిమాకి ప్రాణం అని చెబుతున్నారు. ఇటీవల విడుదల చేసిన రెట్రో లుక్ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. టైటిల్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మాస్ రాజాకి బంపర్ హిట్ పడాలని మాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఆ కోరికను నెరవేరుస్తారా లేదా? అన్నది చూడాలి.