మాస్‌ రాజా మునుపటి జోరు

Update: 2020-01-26 05:41 GMT
ఒకప్పుడు రవితేజ హీరోగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వచ్చేవి. కాని ఆమద్య వరుసగా ఫ్లాప్‌ లు రావడంతో సినిమాల స్పీడ్‌ తగ్గించాడు. ఆచి తూచి సినిమాలను చేస్తున్నాడు. దాంతో ఆయన చిత్రాల మద్య చాలా ఎక్కువ గ్యాప్‌ వచ్చింది. కాని ఈ ఏడాది మాత్రం మాస్‌ రాజా ఫ్యాన్స్‌ కు పండుగ అని చెప్పుకోవచ్చు. గతంలో మాదిరిగా ఈ ఏడాది రెండు లేదా మూడు సినిమాలను రవితేజ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటికే డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ క్రాక్‌ చిత్రంతో మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్బంగా క్రాక్‌ యూనిట్‌ సభ్యులు రిలీజ్‌ డేట్‌ తో కూడిన పోస్టర్‌ ను విడుదల చేశారు. ఇన్ని నెలల ముందే సినిమా తేదీని విడుదల చేయడం పట్ల వారికి సినిమాపై ఎంత క్లారిటీ ఉందో చెప్పకనే చెప్పవచ్చు.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బి మధు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. రవితేజ గతంలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించి పలు చిత్రాల్లో ఆకట్టుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఫుల్‌ లెంగ్త్‌ పోలీస్‌ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతో రవితేజ మరోసారి తన ఫ్యాన్స్‌ కు పండుగ తీసుకురావడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. క్రాక్‌ మాత్రమే కాకుండా ఈ ఏడాది మరో సినిమాను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Tags:    

Similar News