పూరి కాదు..కృష్ణవంశీనే అంటున్న రవితేజ

Update: 2015-12-10 06:19 GMT
చిన్నా చితకా క్యారెక్టర్లు వేసుకునే రవితేజను పెద్ద హీరోను చేసింది పూరి జగన్నాథ్. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం - ఇడియట్ - అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలతో రవితేజ కెరీర్ నే మార్చేశాడు. ముఖ్యంగా ‘ఇడియట్’ సినిమా రవితేజకు ఓ స్టయిల్ క్రియేట్ చేసి.. అతడికో సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. రవితేజ బాడీ లాంగ్వేజ్ ను బాగా అర్థం చేసుకున్న డైరెక్టర్ గా పూరిని చెబుతారు. ఐతే పూరి కంటే ముందు తనేంటో బాగా అర్థం చేసుకుంది కృష్ణవంశీనే అంటున్నాడు మాస్ రాజా.

‘‘అవును..పూరి కంటే ముందు కృష్ణవంశీ పేరు చెప్పాలి. నా బాడీ లాంగ్వేజ్‌ ని అందరి కంటే ముందు అర్థం చేసుకున్నది అతనే. ఆ తర్వాత  పూరి జగన్నాథ్. ఇడియట్ సినిమాలో నా స్టయిల్ అందరికీ నచ్చడంతో అలాగే కంటిన్యూ అవుతున్నా’’ అని రవితేజ చెప్పాడు. ఐతే తన స్టయిల్ వదిలేసి కొత్తగా చేద్దామని ట్రై చేసినపుడల్లా తనకు ఎదురు దెబ్బలే తగిలాయని.. నా ఆటోగ్రాఫ్ - శంభో శివ శంభో - నేనింతే లాంటి సినిమాలు జనాలకు నచ్చలేదని.. అయినప్పటికీ కొత్త తరహా సినిమాలు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటానని చెప్పాడు మాస్ రాజా. ఐతే ఏ తరహా సినిమా అయినా సరే తాను కథ వినగానే ఆన్ ద స్పాట్  డెసిషన్స్ తీసుకుంటానని.. తన నిర్ణయాలు కొన్నిసార్లు ప్రతికూల ఫలితాన్నిచ్చినా.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే పద్ధతి మాత్రం మాననని రవితేజ అన్నాడు.
Tags:    

Similar News