ఎంఐఎం ఎటాక్ తో ఆ సినిమాను వదిలేసిన రవితేజ

Update: 2022-02-14 10:30 GMT
విష్ణు విశాల్‌ హీరోగా గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ఎఫ్‌ఐఆర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంజిమా మోహన్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగు లో రవితేజ సమర్పిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. రవితేజ ఈ సినిమాపై ఆసక్తి చూపించి సమర్పించేందుకు ఒప్పుకున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విడుదల సమయంలో ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమా కు రవితేజ సమర్పకుడు అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. విష్ణు విశాల్‌ తెలుగు లో ఈ సినిమా తో ఖచ్చితంగా మంచి ఎంట్రీని దక్కించుకోవడం ఖాయ అని.. అలాగే త్వరలో రవితేజ తో కలిస నటించబోతున్న సినిమా తో కూడా ఈయనకు మరింత స్టార్‌ డమ్‌ పెరుగుతుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేశారు. కాని ఈ సినిమా తెలుగు రాష్ట్రం తెలంగాణలో వివాదాన్ని మూట కట్టుకుంది. ఈ సినిమా స్క్రీనింగ్‌ ను ఆపేయాలంటూ ఎంఐఎం పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణలో కీలకమైన ఎంఐఎం పార్టీ నాయకులు ఈ సినిమాకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో తెలంగాణలో ఈ సినిమా కొన్ని చోట్ల ఇప్పటికే ప్రదర్శణ నిలిపి వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ముస్లీం ను కించపర్చే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే ఈ సినిమా పోస్టర్ లో షహదా అనే పదం ను వినియోగించారు అంటూ ఎంఐఎం నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కు వ్యతిరేకంగా ముస్లీం లు ఉద్యమం చేయాలంటూ వారు పిలుపునిచ్చారు.

రవితేజ ఈ సినిమాను సమర్పిస్తున్నట్లుగా విడుదలకు ముందు వరకు హడావుడి చేశారు. కాని ఎప్పుడైతే ఈ సినిమా వివాదాస్పదం అయ్యిందో వెంటనే రవితేజ సమర్పకుడిగా పేరును తొలగించడం జరిగింది. ఇలాంటి వివాదాస్పద సినిమాను మోయడం తన వల్ల కాదు అన్నట్లుగా రవితేజ తప్పకున్నాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమా కు పాజిటివ్‌ టాక్ వచ్చినా పట్టించుకోవడం లేదు.

సినిమా కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమంలోనే కాకుండా కనీసం సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. సినిమాపై విమర్శలు వివాదాలు మొదలు అయిన నేపథ్యంలో రవితేజ వెంటనే తప్పుకుని మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మంచి సినిమాను రవితేజ మద్యలో వదిలేశాడు అంటూ మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక రవితేజ ఖిలాడి సినిమా విషయానికి వస్తే తీవ్రంగా నిరాశ పర్చింది. ఎఫ్‌ఐఆర్‌ సినిమా విడుదల అయిన రోజే ఖిలాడి సినిమా కూడా విడుదల అయిన విషయం తెల్సిందే. ఖిలాడి హడావుడి తగ్గిన నేపథ్యంలో ధమామా సినిమా షూటింగ్ లో రవితేజ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమ్మర్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇవే కాకుండా రావణసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో కూడా రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Tags:    

Similar News