టాలీవుడ్ స్టార్ హీరోల్లో స్వయంకృషితో ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మాస్ మహారాజా రవితేజ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. చిరంజీవి, అమితాబ్ స్ఫూర్తితో ఆ ఇద్దరినీ దేవుళ్లుగా పూజించి స్వయంకృషితో పెద్ద స్టార్ గా ఎదిగాడు రవితేజ. దశాబ్ధాల పాటు స్టార్ డమ్ ని నిలబెట్టుకుంటూ ఇంత సుదీర్ఘమైన జర్నీ చేశాడు. 1990లో అభిమన్యు అనే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత విజయశాంతి `కర్తవ్యం` చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రలో కనిపించాడు. ఆజ్ కా గూండా రాజ్, వారసుడు, అల్లరి ప్రియుడు వంటి చిత్రాల్లో నటించాడు. నిన్నే పెళ్లాడుతా నుంచి కృష్ణ వంశీకి శిష్యుడు అయిపోయాడు. సింధూరం సినిమాతో హీరో అయ్యాడు. బ్రహ్మాజీతో కలిసి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో మైమరిపించాడు. ఆ తర్వాత వైట్ల దర్శకత్వంలో `నీకోసం` చిత్రంతో సోలో హీరోగా మెప్పించాడు. అటుపై రవితేజ కెరీర్ గురించి తెలిసిందే. ఇంతింతై వటుడింతై సుమారు 10-15 కోట్లు పారితోషికం అందుకునే బిగ్ స్టార్ గా ఎదిగేశాడు.
కెరీర్ లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. మాస్ లో అసాధారణ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే 65 సినిమాల్లో నటించాడు మాస్ రాజా. ఇటీవల కొన్ని వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టాయి. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్టు లేదు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని .. ఇలా వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టాయి. అయినా రాజాలోని ఎనర్జీపై నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నేల టిక్కెట్ నిర్మాతలు ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్ అధినేతలు రవితేజతో మరో ప్రాజెక్టును ఖాయం చేశారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
తాజాగా టైటిల్ ని ప్రకటించారు. రవితేజ కు తగ్గట్టే `డిస్కో రాజా` అంటూ స్ట్రైకింగ్ టైటిల్ ని సెలక్ట్ చేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఎస్ఆర్ టీ టీమ్ ఈ టైటిల్ ని ప్రకటించింది. త్వరలోనే షూటింగ్ ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సాయి రిషిక సమర్పణలో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తోంది. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. రవితేజకు కంబ్యాక్ అవ్వాల్సిన టైమ్ ఇది. మంచి కథను ఎంచుకుని.. ఈసారైనా అభిమానుల్ని నిరాశపరచడనే భావిస్తున్నారు.