ఈమద్య కాలంలో తెలుగు సినిమా మార్కెట్ ఏ స్థాయికి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా అనగానే ఉత్తరాదిన మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగు హీరోలకు భారీ పారితోషికాలు.. తెలుగు టెక్నీషియన్స్ కు పాన్ ఇండియా గుర్తింపు.. తెలుగు హీరోల స్థాయి పాన్ ఇండియా స్థాయి. అందుకే తమిళ హీరోలు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ధనుష్ 'సర్' అనే సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. వెంకీ అట్లూరి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మరో వైపు శివ కార్తికేయన్ కూడా తెలుగు లో ఒక సినిమాను చేస్తున్నాడు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది. ఈ సమయంలోనే తమిళ హీరోలు మరి కొందరు కూడా తెలుగు లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అందులో ఒకరు విష్ణు విశాల్. తమిళంలో డీసెంట్ హీరో అంటూ పేరు దక్కించుకున్న విష్ణు విశాల్ ను మాస్ రాజా రవితేజ తెలుగు ప్రేక్షకులకు తన సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాడు.
రానా నటించిన అరణ్య సినిమాతో విష్ణు విశాల్ తెలుగు వారికి పరిచయం అయ్యాడు. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇప్పుడు ఆయన ఫ్రెష్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. రవితేజ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఏ సినిమాలో రవితేజ తో కలిసి విష్ణు విశాల్ నటిస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రవితేజ ఈమద్య కాలంలో మల్టీ స్టారర్ సినిమా లపై ఆసక్తి చూపిస్తున్నాడు. చిరంజీవి తో రవితేజ స్క్రీన్ షేర్ చేసుకునేందుకు గాను సిద్దం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రవితేజ తమిళ హీరో విష్ణు విశాల్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దం అవ్వడం అభినందనీయం.
రవితేజ ఇప్పటికే నటించిన ఖిలాడి సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఆ సినిమా తర్వాత మొదలు పెట్టిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఇంకా ధమాకా.. టైగర్ నాగేశ్వరరావు మరియు రావణసుర సినిమాలను రవితేజ బ్యాక్ టు బ్యాక్ చేసేందుకు గాను సిద్దం అయ్యాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ అన్ని సినిమాల్లో రెండు లేదా మూడు ఈ ఏడాదిలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కరోనా సహకరిస్తే ఖచ్చితంగా ఈ ఏడాదిలో రవితేజ అభిమానులకు పండుగ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రతి సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ప్రతి సినిమాలో కూడా రవితేజ చాలా వైవిధ్యభరితంగా కనిపించబోతున్నాడు. కనుక ఆయనకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు ఖాయంగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.