100 రోజుల వ్యవధిలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు మాస్ రాజా రవితేజ. ఫిబ్రవరిలో వచ్చిన అతడి సినిమా ‘టచ్ చేసి చూడు’ తీవ్రంగా నిరాశ పరిచింది. తాజాగా ‘నేల టిక్కెట్టు’ దాన్ని మించిన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ లేవు. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. ఈ సినిమాను కాపాడేందుకు ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేని పరిస్థితి. దీంతో మాస్ రాజా కూడా ఫోకస్ తన తర్వాతి సినిమాల మీదికి మళ్లించేశాడట. అతను ఆల్రెడీ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రొటీన్ సినిమాలతో ఎదురు దెబ్బలు తింటున్న రవితేజ.. ఇకపై మార్పు చూపించకపోతే కష్టం. ఐతే వైట్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు కాబట్టి ఆ సినిమా నుంచి మరీ కొత్తదనం ఆశిస్తే కష్టం.
కాబట్టి ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో రవితేజ జాగ్రత్త పడ్డట్లే ఉన్నాడు. ఇన్నాళ్లు హోల్డ‌్ లో పెట్టిన దర్శకుడికే అతను ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. ‘ఒక్క క్షణం’ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన వీఐ ఆనంద్ తో మాస్ రాజా ఒక ప్రాజెక్టు ఓకే చేశాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. విశేషం ఏంటంటే వైట్ల సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న రవితేజ.. ఆనంద్ సినిమాలో డబుల్ రోల్ లో కనిపించనున్నాడట. ఐతే అది రెగ్యులర్ డబుల్ రోల్ లాగా ఉండదని.. కొత్తగా ఏదో ట్రై చేయబోతున్నారని సమాచారం. ఇంకో మూడు నెలల్లో వైట్ల సినిమాను ముగించి ఈ ప్రాజెక్టు మీదికి రాబోతున్నాడు మాస్ రాజా. రాబోయే రెండు సినిమాలు రవితేజ కెరీర్ కు కీలకం కాబోతున్నాయి. అవి ఆడకుంటే అతడి కెరీర్ ప్రమాదంలో పడటం ఖాయం.