మాస్ మహారాజా రవితేజకు టచ్ చేసి చూడు ఫైనల్ గా పెద్ద షాకే ఇచ్చేలా ఉంది. ఏ మాత్రం కోలుకోవడానికి అవకాశం లేనంతగా నెగటివ్ టాక్ పాకుతుండటంతో ఇది సేఫ్ గా బయట పడటం కష్టమే. రాజా ది గ్రేట్ ఇచ్చిన సక్సెస్ కిక్ దీనితో కొంత తగ్గటం ఖాయం. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రవితేజ తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల కు ఓకే చెప్పి ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కారణం శీను వైట్ల గత మూడు సినిమాలు ఆగడు - బ్రూస్ లీ - మిస్టర్ డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాయి. అయినా తనతో మూడు సినిమాలు చేసిన అనుబంధం - కెరీర్ లో మేజర్ బ్రేక్ గా నిలిచిన నీ కోసం తన వల్లే చేయటం తదితర కారణాల వల్ల రవితేజ స్నేహ ధర్మం పాటిస్తున్నట్టు టాక్.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో రవితేజ ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడట. ఇది తనకు మొదటిసారి. మొన్నామధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చేసిన తర్వాత ఇంత తక్కువ గ్యాప్ లో మరో స్టార్ హీరో చేయటం విశేషమే. ప్రస్తుతం హీరొయిన్ల సెలక్షన్ జరుగుతోందట. కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ ఓకే అయినట్టే అని టాక్ ఉండగా మరో హీరొయిన్ గా నివేదా థామస్ తో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మరో హీరొయిన్ గా అనుపమ, అను ఇమ్మానియేల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి కాని వాళ్ళు ఎంతవరకు ఓకే చెప్తారు అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. దీనికి టైటిల్ గా అమర్ అక్బర్ అంటోనీ అని ఫిక్స్ చేయవచ్చు అని ఇన్ సైడ్ టాక్.
కొంత గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ తో మళ్ళి ట్రాక్ లో పడిన రవితేజ చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. టచ్ చేసి చూడు దెబ్బ కొట్టినా ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు కాని ఒక్క పాత్రతోనే ఫుల్ ఎనర్జీతో కిక్కిచ్చే రవితేజ ఒకేసారి మూడు పాత్రల్లో కనిపిస్తే ఇంకెంత అల్లరి చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజల్ కి రవితేజతో ఇది మూడో సినిమా అవుతుంది. వీరా,సారొచ్చారు తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఇది రూపొందనుంది