బాబాయ్.. అబ్బాయ్ లతో ఒకే క్షణం

Update: 2016-07-12 14:44 GMT
సీనియర్ హీరోలు తమ వారసులతో కలిసి సినిమా చేయాలనే కాన్సెప్ట్ మంచి ఊపు మీదే ఉంది. మనం తర్వాత ఇలాంటి వాటికి డిమాండ్ మరింతగా పెరిగింది. ప్రతీ వంశంలోనూ ఇలాంటి సినిమా మనమూ చేయాలనే కోరిక ఉన్నా.. సరైన సబ్జెక్ట్ దొరక్క ఎవరూ ధైర్యం చేయడం లేదు. బాబాయ్-అబ్బాయ్ ల కాంబినేషన్ చాలా రోజులుగా ఇండస్ట్రీని ఊరిస్తోంది.

పవన్ కళ్యాణ్- రామ్ చరణ్.. బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు వెంకటేష్-దగ్గుబాటి రానాలు కలిసి నటిస్తే చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రానా ఈ విషయాన్ని ఓపెన్ చాలాసార్లే చెప్పాడు. ఇప్పుడు వీరిద్దరికి ఓ సూపర్బ్ స్టోరీ లైన్ వినిపించాడట క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు. ఈ డైరెక్టర్ చెప్పిన లైన్ కి ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిన దగ్గుబాటి హీరోలు పూర్తి వెర్షన్ సిద్ధంగా చేయాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రవికాంత్ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ రెడీ చేసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా పూర్తయ్యాక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాలని దగ్గుబాటి హీరోలు భావిస్తున్నారు. సహజంగా ఇలాంటి మల్టీ స్టారర్లకు వెంకటేష్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాడు. ఇప్పటికే మహేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.. పవన్ తో గోపాలా గోపాలా.. రామ్ తో మసాలా వంటి సినిమాలను చేసిన వెంకీకి.. ఇది మరో క్రేజీ మల్టీ స్టారర్ అవుతుంది.
Tags:    

Similar News