మాస్ మహరాజ్ రవితేజకు తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చెప్పేందుకు మాటలు చాలవు. రవితేజకు గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. వీటి విషయంలో పెద్దగా స్పందించలేదు రవితేజ. బాలీవుడ్ ఎంట్రీపై తనకు ఎలాంటి తొందర లేదని తేల్చేశాడు మాస్ మహరాజ్.
'నేను హిందీ చాలా బాగా మాట్లాడతాను. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే పర్ఫెక్ట్ గా హిందీ మాట్లాడగలను. అయితే బాలీవుడ్ లో అడుగు పెట్టేయాలని నాకు తొందరేమీ లేదు. ఆ స్క్రిప్ట్ నన్ను బాలీవుడ్ తీసుకెళ్లాలి తప్ప.. నేను ముంబై వెళ్లడానికి స్క్రిప్ట్ వెతుక్కోకూడదు' అంటున్నాడు రవితేజ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల ట్రెండ్ బాగుందన్న మాస్ మహరాజ్.. ఆర్ బాల్కి తీసిన కి అండ్ కా, కరన్ జోహార్ మూవీ కపూర్ అండ్ సన్స్ లాంటి చిత్రాలు చేయాలని ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలంటే ఇలాంటి విభిన్నమైన సబ్జెక్టులు అయితే చేయచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
అక్కడకు వెళ్లి కూడా ఇదే యాక్షన్ - కామెడీలు చేసుకునేట్లయితే.. అసలు బాలీవుడ్ వెళ్లడం దేనికి.. ఇప్పుడు చేసుకుంటున్న తెలుగు సినిమాలతో కంటిన్యూ అయితే సరిపోతుందిగా అంటున్నాడు రవితేజ. మన మాస్ మహరాజ్ ఆలోచన కరెక్టే కానీ.. మనకేమో కామెడీతో సరిపెట్టేసి.. బాలీవుడ్ జనాలకు ట్యాలెంట్ చూపిస్తానని చెప్పడం అంటే.. ఏదో తేడాగా ఉంది కదూ.