ర‌వితేజ డైలాగులు వార‌సుల‌కి ఎక్క‌డో త‌గుల్తున్నాయా?

Update: 2022-12-18 05:30 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగిన వాడు.  మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో న‌టుడయ్యాడు. ఆ  త‌ర్వాత అంత‌టి పేరు తెచ్చుకున్న న‌టుడాయ‌న‌. నేచుర‌ల్ స్టార్ నాని.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ లాంటి వారికి ర‌వితేజ ఇనిస్పేరేష‌న్. అత‌న్ని స్పూర్తిగా తీసుకునే ఇండ‌స్ర్టీలో ఎదిగారు ఇద్ద‌రు.   అటుపై ర‌వితేజ‌...నాని..దేవ‌ర‌కొండ ముగ్గురు  నేటి జ‌న‌రేష‌న్ కి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఎలాంటి బ్యాక‌ప్ లేకుండా ప‌రిశ్ర‌మ‌లో ఎలా ఎదిగాలి అన‌డానికి ఆ ముగ్గురు నేటి త‌రానికి రోల్ మోడ‌ల్స్. అయితే ఈ మధ్య కాలంలో ర‌వితేజ త‌న సినిమాల్లో సైతం త‌న‌ని తాను వ్య‌క్త‌గ‌తంగా ప్రొజ‌క్ట్ చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. చెప్ప‌డానికి అవి సినిమాలో ఆ సీన్ కి  సింక్ అయ్యే డైలాగులే అయినా...అవి వార‌సులకు  ఇంకెక్క‌డో త‌గులుతున్న‌ట్లే క‌నిపిస్తుంది.

ఇటీవ‌లి కాలంలో రవితేజ న‌టించిన చాలా సినిమాల్లో తాను సొంతంగా ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఎదిగినవాడినంటూ సంద‌ర్భం వ‌చ్చినప్పుడ‌ల్లా డైలాగ్ ల రూపంలో అనేస్తున్నాడు. `క్రాక్` లో బ్యాక్ గ్రౌండ్ అనే ప‌దం వినిపిస్తే ర‌వితేజ విల‌న్ గ్యాంగ్ పై బాదేయ‌డం...ఆ సినిమా క‌థ అంతా బ్యాక్ గ్రౌంట్ చుట్టూనే తిరుగుతుంది. `రామారావు ఆన్ డ్యూటీ`..`బెంగాల్ టైగ‌ర్` లోనూ ఇదే త‌ర‌హాలో  సెటైర్లు పేల్చారు.

బెంగాల్ టైగ‌ర్  లో `నేను స‌పోర్ట్ తో పైకి వ‌చ్చిన‌వాడిని కాదు` డైలాగ్... రామారావులో `ల‌క్కుతో పైకి రాలేదు` లాంటి డైలాగులున్నాయి. తాజాగా `ధ‌మాకా`లో అదే త‌ర‌హా డైలాగుల‌తో మోతెక్కిస్తున్నాడు. `వెనుకున్న వాళ్ల‌ను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్`..`వెన‌కెవ‌డు లేక‌పోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని` అన్నారు. ఇవ‌న్నీ ఆయా సంద‌ర్భాల్లో వ‌చ్చిన డైలాగులే అయినా త‌గ‌లాల్సిన వాళ్ల‌కి ఎక్క‌డో త‌గులుతున్న‌ట్లే గుస గుస వినిపిస్తుంది.  ఇలా వ‌రుస‌గా ర‌వితేజ సినిమాల్లో ప‌రోక్షంగా టాలీవుడ్ వార‌సుల‌పై సెటైర్లు వేస్తున్నారంటూ ఫిలిం స‌ర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారుతోంది. మ‌రి రాజా ఇంటెన్ష‌న్ ఏంటో? ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌.
Tags:    

Similar News