మరో కొత్త సినిమా మొదలైంది రాజా

Update: 2017-02-06 04:44 GMT
రవితేజ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ క్షణం  రానే వచ్చింది. 2015 డిసెంబర్ లో వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రవితేజ.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించేయడమే కాదు.. వీటిలో అనిల్ రావిపూడితో తీయనున్న రాజా ది గ్రేట్ షూటింగ్ ప్రారంభించేశాడు కూడా.

ఇవాళ ఉదయాన్నే రాజా ది గ్రేట్ చిత్రం ముహూర్తం షాట్ ను చిత్రీకరించడంతో.. మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైపోయింది. ఫస్ట్ షాట్ కు నందమూరి కళ్యాణ్ రామ్ క్లాప్ కొట్టడం విశేషం. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ నటిస్తోంది. తొలి షాట్ ను రవితేజ.. మెహ్రీన్ లపై చిత్రీకరించారు. ఈ చిత్రంలో రవితేజ ఓ అంధుడి పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.

హీరో గుడ్డివాడిగా నటించినా.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కు ఏ మాత్రం లోటు ఉండదని అంటున్నాడు దర్శకుడు. ఇది పక్కా మాస్ మసాలా ఎంటర్టెయినర్ గా చెబుతున్నాడు నిర్మాత దిల్ రాజు. గతంలో హీరో రామ్.. ఎన్టీఆర్ ల కోసం ఈ సబ్జెక్టును అనుకోగా.. చివరకు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రవితేజతో ప్రారంభించాడు. మాస్ మహరాజ్ మేనరిజమ్స్ కు అనుగుణంగా స్క్రిప్టులో చాలానే మార్పులు చేశాడట దర్శకుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News