నీలో ఉన్నదేంటి? నాలో లేనిదేంటి? ప‌్రశ్నించుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. మరో మూడు రోజుల్లో విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వం వహించిన పులి రిలీజవుతోంది. అక్టోబర్ 1 రిలీజ్ తేదీ. ఆరోజు దేశంలో మరో కొత్త రికార్డు నమోదవ్వబోతోందా? లేదా? అన్నది తేలిపోయే రోజు. బాహుబలిని కొట్టే సినిమా వచ్చిందా? లేదా? తేలిపోయే రోజు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న ఏకైక సినిమా పులి.
విజయ్ - శ్రీదేవి - శ్రుతిహాసన్ - హన్సిక వంటి స్టార్స్ ఉన్న సినిమా ఇది. అయితే ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మగధీర - ఈగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆర్.సి.కమల్ కన్నన్ ఈ సినిమాకి పనిచేశారు. ఆ రెండు సినిమాల్ని కొట్టే విజువల్స్ క్రియేట్ చేశామని ఆయన కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. పులి సినిమా ఫ్యామిలీ ఆడియెన్ కి విజువల్ ట్రీట్. థియేటర్లు కిటకిటలాడిపోవడం ఖాయం అని చెబుతున్నారు. అంతే కాదు పులి కోసం 2400 విఎఫ్ ఎక్స్ షాట్స్ తీశామని చెప్పారాయన. బాహుబలికి 2000 విఎఫ్ ఎక్స్ షాట్స్ - ఈగ కు 1200 షాట్స్ - మగధీరకు 1600 షాట్స్ వినియోగించామని దాంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఎఫెక్టివ్ వర్క్ అని కన్నన్ చెప్పారు. పులి చిత్రంలో ఒంటి కన్ను రాక్షసి - భారీ తాబేలు - నల్ల చిరుత ఐఫీస్ట్ ఇస్తాయని చెబుతున్నారాయన.
వీటన్నిటితో పాటు కథ - కథనం - మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్సెస్ .. అన్నీ సరిగ్గా కుదిరితే పులి రికార్డులు కొట్టేసినట్టే. హాలీవుడ్ రేంజులో విజువల్స్ కనిపిస్తే తెలుగులోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తారు. ఇప్పటికే వీకెండ్ టిక్కెట్ల సేల్ మొదలైంది. జోరుగా అమ్మకాలు సాగుతున్నాయ్.. ఇంకో మూడు రోజులే .. ఓపిక పట్టండి మరి.