ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు కూడా షూటింగ్ ముగియడంతో ఫ్రీ బర్డ్స్ అయ్యారు. జక్కన్న మూవీ షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో రామ్ చరణ్ తన తదుపరి సినిమా ను శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోతున్న ఆ సినిమా లో హీరోయిన్ ను కూడా కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ కోసం లొకేషన్స్ ఎంపిక.. సెట్టింగ్స్ నిర్మాణం కూడా జరుగుతున్నట్లుగా ఇటీవల ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందింది.
సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరు చూస్తుంటే చాలా త్వరగానే సినిమా వస్తుందేమో అనిపిస్తుంది. కాని శంకర్ దర్శకత్వంలో సినిమా కనుక కనీసం రెండేళ్ల సమయం అయినా తీసుకుంటాడు అనేది సగటు నెటిజన్ అభిప్రాయం. అంటే సినిమా రావడానికి 2023 ఎండింగ్ అవుతుంది అనేది వారి అభిప్రాయం. రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబో ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆయన మేకింగ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎంతగా లేట్ అయితే అంతగా బడ్జెట్ ఖర్చు అవుతుంది అనేది ఆయనకు తెలిసిన విషయం. అందుకే ఈ సినిమాను ఏడాదిలోనే పూర్తి చేసేలా శంకర్ తో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది.
దిల్ రాజు సినిమాలకు సంక్రాంతి సీజన్ సెంటిమెంట్. అందుకే రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబోలో తాను నిర్మిస్తున్న సినిమాను సంక్రాంతి సందర్బంగా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. 2022 సంక్రాంతికి ఎలాగూ సాధ్యం కాదు. కనుక 2023 సంక్రాంతికి ఖచ్చితంగా ఆర్ సీ 15 ను విడుదల చేస్తానంటూ దిల్ రాజు నమ్మకంగా ఉన్నాడట. దిల్ రాజు ఈ సినిమా తో దిగ్గజ దర్శకుడు శంకర్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకు రావడం వల్ల ఆయన ఖ్యాతి అమాంతం పెరిగినట్లే అంటూ అభిమానులు అంటున్నారు. మొత్తానికి 2023 లో సినిమా అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి అనడం చూస్తుంటే ఎంత పక్కాగా ప్లానింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమా ను ఒకే సారి అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
--