మాస్ మహారాజా రవితేజ-రమేష్ వర్మ కాంబినేషన్ లో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఖిలాడి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి- డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నందికుడ్కర్ వేసిన భారీ సెట్ లో రవితేజ- మీనాక్షి చౌదరిలపై ఓ పాట చిత్రీకరణను టీమ్ రేపటి నుంచి ప్రారంభించనుంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను తెరకెక్కించనున్నారు. మరో పాట చిత్రీకరణ కోసం పెండింగ్ లో ఉంది. ఇప్పటికే టాకీ పూర్తయింది. ఈ నెలాఖరులోగా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగా ఖిలాడీ 11 ఫిబ్రవరి 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ స్టూడియోస్ తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
సుజిత్ వాసుదేవ్- జికె విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకాంత్ విస్సా.. సంగీత దర్శకుడు డిఎస్పీ సోదరుడు సాగర్ డైలాగ్స్ అందించారు. శ్రీమణి సాహిత్యం అందించగా అమర్ రెడ్డి ఎడిటింగ్ వర్క్ అందించారు. అర్జున్- ఉన్ని ముకుందన్- అనసూయ భరద్వాజ్- నికితిన్ ధీర్- ఠాకూర్ అనూప్ సింగ్- వెన్నెల కిషోర్- రావు రమేష్- ముఖేష్ రిషి- సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ కథ- స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.