డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్...!
కరోనా మహమ్మారి వల్ల థియేటర్స్ లో బొమ్మ పడక నాలుగు నెలలైంది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారో కూడా తెలియడం లేదు. దీంతో మేకర్స్ తమ సినిమాలు రిలీజ్ చేసుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ అయిన చిత్రాలకు ఓటీటీలు వరంగా మారాయి. ప్రేక్షకులు కూడా ఇంట్లోనే కూర్చొని తమ పర్సనల్ స్క్రీన్ మీద కొత్త సినిమాలు చూసే అవకాశం ఉండటంతో ఓటీటీలను ఆదరిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5, ఆహా, సన్ నెక్స్ట్, ఎమెక్స్ ప్లేయర్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వీక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ కొంతమంది సినీ ప్రముఖులు ఎనీ టైం థియేటర్ (ఏటీటీ)లను క్రియేట్ చేసి సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేసారు.
శ్రేయాస్ మీడియా వారు 'శ్రేయాస్ ఈటీ' పేరుతో పర్సనల్ యాప్ క్రియేట్ చేసి సినిమాలను విడుదల చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే పర్సనల్ థియేటర్ క్రియేట్ చేసుకొని తాను తీసే సినిమాలన్నింటిని రిలీజ్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కార్పొరేట్ కంపెనీలు డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టేసాడు. షకీలా కూడా తన సినిమాని ఆన్లైన్ లో రిలీజ్ చేసుకుంది. రామసత్యనారాయణ అనే నిర్మాత 'భీమవరం టాకీస్' పేరిట ఏటీటీ ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్ నటుడు రాజారవీంద్ర తన ఫ్రెండ్స్ తో కలిసి ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నాని.. వెబ్ కంటెంట్ కావాలని ఇప్పటికే ప్రకటన చేసారు. డైరెక్టర్ తేజ కూడా ఓ పర్సనల్ ఆన్లైన్ థియేటర్ క్రియేట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు కూడా ఏటీటీ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్న సదరు రియల్ ఎస్టేట్ వారు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ స్టార్ట్ చేయడానికి ఓ ప్రొడ్యూసర్ సహాయం తీసుకుంటోందని సమాచారం. ఓటీటీలు చిన్న సినిమాలు విడుదల చేసుకొడానికి మాత్రమే పనికొస్తాయని.. అదే ఏటీటీలో అయితే పే ఫర్ వ్యూ పద్ధతిలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేసి లాభాలు పొందవచ్చని వారు ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో ముందుగా చిన్న మీడియం సినిమాలను తీసుకుని ఆన్ లైన్ లో విడుదల చేసి ఏటీటీని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే శ్రేయాస్ మీడియా మరియు రామ్ గోపాల్ వర్మ ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అవడంతో ఇప్పుడు వీరు కూడా అదే బాటలో నడవడానికి డిసైడ్ అయ్యారట. మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో కరోనా తెచ్చిన మార్పుల వల్ల పెట్టుబడి పెట్టగలిగిన వారందరూ డిజిటల్ వరల్డ్ లో ఒక రాయేసి చూద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు అర్థం అవుతోంది.