మహేష్ చేసింది అఖిల్ మిస్ అయ్యాడు

Update: 2019-02-05 04:13 GMT
అక్కినేని అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం అఖిల్ మిస్టర్ మజ్ను ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం ఊహించనిదే. మొదటి రెండు సినిమాలు దేబ్బెసాయి కాబట్టి దీని విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఉంటారనుకోవడం సహజం. అయితే జరిగింది వేరు. మిస్టర్ మజ్ను సైతం నష్టాల నుంచి తప్పించుకోలేడని అర్థమైపోయింది. అయితే అఖిల్ ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి నాగార్జున లాంటి స్ట్రాటజిస్ట్ ప్లానింగ్ లో సైతం ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అనిపించడం కామన్. కాని ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాలి.

మహేష్ బాబు తెరంగేట్రం చేసిన సినిమా రాజకుమారుడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అన్ని మసాలాలు సరితూగేలా వండిన తీరు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. మణిశర్మ సంగీతం కృష్ణతో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రకాష్ రాజ్ పాత్ర సెకండ్ హాఫ్ లో పండించిన ఎమోషన్స్ అన్ని సమపాళ్లలో కుదిరి పర్ఫెక్ట్ లాంచింగ్ చేసాయి. మహేష్ ఎంట్రీ ఇచ్చే నాటికి అఖిల్ తరహాలోనే పసితనం చాయలు తనలోనూ ఉన్నాయి. ఒక్కడు ముందు వరకు ఇదే పరిస్థితి. క్రమంగా ప్రిన్స్ తనను తాను మలుచుకున్న తీరు మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది.

అఖిల్ అందం విషయంలో ఏ లోటూ లేనట్టు అనిపిస్తున్నప్పటికీ అన్ని వర్గాలను మెప్పించేలా కథలు ఎంచుకోవడంలోనే పొరపాట్లు చేస్తున్నాడు. ముచ్చటగా మూడు తప్పులు జరిగిపోయాయి. ఇక వాటిని గతం గతః అని వదిలేసి అఖిల్ అన్ని సెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ కథలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఎవరిదాకా ఎందుకు. నాగార్జున డెబ్యు మూవీ విక్రం సైతం రెగ్యులర్ కమర్షియల్ మూవీనే. శివ మినహాయించి కెరీర్ ని టర్న్ చేసిన అల్లరి అల్లుడు వారసుడు లాంటివన్నీ పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్స్. సో అఖిల్ తాను ఏం మిస్ అవుతున్నాడో గుర్తించి ఈ లవర్ బాయ్ పాత్రలు వదిలేసి ఆల్ రౌండర్ రోల్స్ వైపు లుక్ వేస్తే మంచి రిజల్ట్స్ రాబట్టుకోవచ్చు
Tags:    

Similar News