సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ను బాగా నమ్ముతారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోలు - నిర్మాతలు - దర్శకులు అంతా కూడా సెంటిమెంట్ ప్రకారం నడుచుకుంటారు. వారి ప్రతి సినిమాకు పలు సెంటిమెంట్ లను చూసుకుని మరీ చేస్తారు. అందరిలాగే అల్లు అరవింద్ కూడా పలు సెంటిమెంట్లను నమ్ముతాడు. నిర్మాతగా ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ లో కొనసాగుతున్న అల్లు అరవింద్ మరో వైపు సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటాడు. తనకు నచ్చిన చిత్రాలకు చెందిన ఏదో ఒక ఏరియా రైట్స్ ను కొనుగోలు చేస్తూ - డిస్ట్రిబ్యూట్ చేసే అల్లు అరవింద్ తాజాగా ‘పేపర్ బాయ్’ చిత్రం తెలుగు రాష్ట్రా మొత్తం రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.
పేపర్ బాయ్ చిత్ర నిర్మాత సంపత్ నంది తమ చిత్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఏదో ఒక ఏరియాకు కొనుగోలు చేయాల్సిందిగా అల్లు అరవింద్ ను కోరడం జరిగింది. కథ చెప్పడంతో పాటు, సినిమా ప్రత్యేక షో ద్వారా ప్రివ్యూ చూసిన అల్లు అరవింద్ కు చిత్రంపై ఎక్కడో చిన్న అపనమ్మకం కలిగింది. అలాంటి సమయంలో తన సోదరి వసంతకు చిత్రాన్ని చూపిస్తూ ఉంటాడు అల్లు అరవింద్. గతంలో పలు సార్లు ఆమె సినిమా చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ జడ్జ్‌మెంట్ ఎక్కువ సార్లు నిజం అవ్వడంతో పేపర్ బాయ్ విషయంలో కూడా ఆమెపై నిర్ణయాధికారంను పెట్టడం జరిగింది.
అల్లు అరవింద్ సోదరి వసంతతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రివ్యూ చూశారు. అంతా కూడా మంచి సినిమా అని జడ్జ్ మెంట్ చేయడం వల్లే సినిమాను కొనుగోలు చేసేందుకు అల్లు అరవింద్ ముందుకు వచ్చినట్లుగా మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఆంధ్రా మరియు నైజాం ఏరియాల్లో అల్లు అరవింద్ సొంతంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తూ - సీడెడ్ రైట్స్ ను మాత్రం మరో డిస్ట్రిబ్యూటర్ కు అమ్మేయడం జరిగింది. ఇక శాటిలైట్ రైట్స్ ను కూడా అల్లు అరవింద్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా నమ్మకం ఉండబట్టే ఇంతగా ఈ చిత్రం రైట్స్ ను దక్కించుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈచిత్రం ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.